YS Sharmila Bjp : జగన్ పై షర్మిల విమర్శలు ..  బీజేపీ గుర్రు ?

ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల పూర్తిగా ఏపీ ప్రభుత్వాన్ని, తన అన్న జగన్ ను టార్గెట్ చేసుకుని రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేస్తూ వస్తున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల ఏపీకి సంబంధించి అనేక ప్రశ్నలు స్పందిస్తున్నారు.ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని, బిజెపిని చూసి జగన్ భయపడుతున్నారని, అందుకే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారని ఇలా రకరకాల విమర్శలు చేస్తున్నారు.

ఈ విమర్శలపై టీడీపీ, జనసేన సైలెంట్ గానే ఉంటూ పరోక్షంగా షర్మిల వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు.

ఈ విమర్శలు వైసిపి తో పాటు, బిజెపికి ఇబ్బందికరంగా మారడంతో షర్మిల ( YS Sharmila )వ్యాఖ్యలపై ఆ పార్టీ చాలా సీరియస్ గానే ఉంది.

ముఖ్యంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ.

మణిపూర్ అంశాన్ని తెరపైకి తేవడం, రాష్ట్రంలో అన్ని పార్టీలు మరిచిపోయిన ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో దీక్ష చేపట్టడం, కాంగ్రెస్ నేతలతో పార్లమెంటులో దీనిపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వంటి వ్యవహారాలను బిజెపి( BJP ) చాలా సీరియస్ గానే తీసుకుంది.

"""/" / ఏపీలో మిగతా ఏ పార్టీలు బిజెపి పై విమర్శలు చేసేందుకు సాహసించడం లేదు .

ఏపీ బీజేపీ నాయకులు వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేసినా, ఆ విమర్శలు చేసిన నాయకులను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటారు తప్పించి, కేంద్రం ను విమర్శించే సాహసం చేయరు.

కానీ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో కేంద్రాన్ని ఇందులోకి లాగడం, వివాదాస్పద అంశాలను మళ్లీ తెరపైకి తెస్తుండడంతో, షర్మిల వ్యవహారం తమకు రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందికరంగా మారుతుందని బిజెపి భావిస్తోంది.

"""/" / దీంతో షర్మిలకు రాజకీయంగా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు బిజెపి సిద్ధమవుతోందట.

ఈ మేరకు ఏపీ బీజేపీ నేతలకు దీనిపై ఆదేశాలు ఇచ్చేందుకు,  షర్మిల విమర్శలకు చెక్ పెట్టేందుకు కేంద్ర బిజెపి పెద్దలు రంగంలోకి దిగబోతున్నారట.

జగన్ ను( Cm Ysjagan ) ఇరుకునపెట్టేందుకే షర్మిల విమర్శలు చేస్తున్నా, అంతిమంగా ఆ విమర్శల ఎఫెక్ట్ బీజేపీ పైనే ఎక్కువ ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

రేవంత్ రెడ్డి ‘ ఆకస్మిక ‘ నిర్ణయం .. ఇక పరుగులు పెట్టిస్తారా ?