వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించిన షర్మిలమ్మ..

ఇడుపులపాయలో YS షర్మిల కామెంట్స్.వైయస్సార్ గారి సంక్షేమ పాలన అంటే రైతుల కి ఉచిత విద్యుత్ జలయజ్ఞం రుణమాఫీ.

వైయస్సార్ గారి సంక్షేమ పాలన అంటే పేద పిల్లలకు ఉచిత విద్య పేద వాళ్ళకి ఉచిత వైద్యం ఇవ్వడం.

ఈరోజు తెలంగాణలో వైయస్సార్ గారి సంక్షేమ పాలన ఉందా అని అడిగితే లేదు అనే సమాధానమే వస్తుంది.

ఇది నా సమాధానం కాదు.ఇది తెలంగాణ ప్రజల సమాధానం వైయస్సార్ గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా మేము రేపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలు పెడుతున్నాం.

రాష్ట్రమంతా తిరుగుతాం ప్రతి పల్లెకు పోతాం ప్రతి గడపను తడతాం.ప్రజలతో మమేకం అవుతాం ప్రజల కష్టాలను వారి నోటి నుంచి వింటాం.

ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల పక్షాన నడుస్తాం.

వైయస్సార్ గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా చేస్తున్న ఈ పాదయాత్ర తెలంగాణ ప్రజలంతా వైఎస్సార్ అభిమానులంతా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా మా అడుగులో అడుగు వేయండి మనమంతా కలిసి పోరాడితే వైయస్సార్ గారి సంక్షేమ పాలన మళ్లీ సాధ్యం.

అల్జీమర్స్ అంటే ఏంటి.. వ్యాధి ల‌క్షణాలు ఎలా ఉంటాయి..?