కోరి కష్టాలు తెచ్చుకున్న షర్మిల ! భవిష్యత్ గందరగోళం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( Ys Sharmila )రాజకీయంగా తప్పక అడుగులు వేసినట్టుగానే కనిపిస్తున్నారు.

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ స్థాపించిన షర్మిల ఒంటరిగానే రాజకీయ పయనన్ని ప్రారంభించారు.

300 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు.అనేక ప్రజ ఉద్యమాలలోనూ పాల్గొన్నారు.

ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS Party )తప్పిదాలను హైలెట్ చేస్తూ,  ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

అయితే ఆశించిన స్థాయిలో పార్టీలో చేరికలు లేకపోవడం, ఎన్నికలు సమయం దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో , కాంగ్రెస్( Congress ) తో పొత్తు కోసం ప్రయత్నించారు.

కానీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే వరకు పరిస్థితి వచ్చింది .

దానికి కూడా షర్మిల సిద్ధమవగా,  ఇప్పుడు తెలంగాణలో షర్మిల రాజకీయాలు చేసేందుకు వీలులేదని , ఏపీలోనే కాంగ్రెస్ బాధ్యతలు చూసుకోవాలని పదేపదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

"""/" / ఇక దాదాపుగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే నిర్ణయంతో ఉండడంతో,  షర్మిల పరిస్థితి ఎటూ కాకుండా మారింది.

ఇప్పుడు మళ్లీ తన పార్టీని యాక్టివ్ చేసుకోలేని పరిస్థితి.అలా అని కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసినా,  తెలంగాణలో రాజకీయాలు చేసేందుకు ఆమెకు సరైన పరిస్థితులు కాంగ్రెస్ లో కనిపించడం లేదు.

దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై షర్మిల గందరగోళంలో ఉన్నారు.అసలు కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం చేసేందుకు షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి రానిచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇష్టపడడం లేదు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో షర్మిల ఉన్నా , ఆమెకు టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు.

ఇప్పటికే ఆమెను టార్గెట్ చేసుకొని అనేకమంది కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. """/" /  ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ( Renuka Chowdary )షర్మిలకు వ్యతిరేకంగా గొంతు పెంచుతున్నారు.

పార్టీని స్థాపించి భారీగా సొమ్ములు ఖర్చుపెట్టి అనేక కార్యక్రమాలు సొంతంగా నిర్వహించి,  3000 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన షర్మిల పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది.

ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టలేక ,  తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్న వ్యతిరేకత ఇవన్నీ పార్టీ విలీనానికి ముందే చోటు చేసుకోవడం వంటివి షర్మిల కు మరింత గందరగోళం కలిగిస్తున్నాయి.

.

దేవర ట్రైలర్ మీదనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉందా..?