షర్మిల టార్గెట్ వైసీపీ ? ఫలితం ఉంటుందా ?
TeluguStop.com
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల( YS Sharmila ) ఇక ఏపీలో జరగబోయే ఎన్నికలే టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు .
క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఇప్పటికే షర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నారు .ఏపీ అంతట పర్యటించి కాంగ్రెస్ ను( Congress ) బలోపేతం చేసే విధంగానూ, అలాగే పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగానూ షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు.
అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది.
తన సొంత అన్న స్థాపించిన పార్టీ అయినా, """/" /
2019 ఎన్నికల్లో వైసీపీకి ( YCP ) అనుకూలంగా షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించినా.
ఇప్పుడు మాత్రం వైసిపికి రాజకీయంగా షర్మిల శత్రువే .దీంతో షర్మిల వైసీపీని ఇరుకును పెట్టే విధంగా వ్యవహరించబోతున్నారనే విషయం అర్థమవుతుంది.
ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంతో పాటు, ప్రభుత్వాన్ని, వైసీపీని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి షర్మిలకు ఏర్పడింది .
దీంతో వైసీపీ పై షర్మిల ఏ విధంగా విరుచుకుపడతారు అనే దాని పైన కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉండబోతోంది.
ఇంకా ఏపీలో ఎన్నికలకు( AP Elections ) మూడు నెలలు కూడా సమయం లేదు .
ఇప్పటికప్పుడు షర్మిల ప్రభావం కాంగ్రెస్ లో పెద్దగా కనిపించే అవకాశం లేదు. """/" /
అలా అని ఇప్పటి వరకు వైసీపీని, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని షర్మిల విమర్శలు చేయలేదు.
అయితే ముందు ముందు వైసీపీని టార్గెట్ చేసుకున్నా .ఆ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు.ఏపీ , తెలంగాణ విభజన తరువాత కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కనిపించింది.
అది 2014, 2019 ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది.ఇప్పటికిప్పుడు షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపినా, ఫలితం ఏమి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.