మా అమ్మ ఓకే అంటేనే సైన్ చేస్తా .. లేదంటే లేదు : స్టార్ హీరో

బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల నుంచి హీరోగా రాణిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఒక్కసారిగా అమ్మ ఒప్పుకుంటేనే సినిమాలు చేస్తాననడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.

అందుకు గల కారణం 76 ఏళ్ల వయసున్న తన తల్లి షర్మిలా టాగోర్‌కు తన కొడుకు గురించి ఎంతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి తను నటించే సినిమా కథలు అమ్మ కూడా వినాలి.

ఆమె ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంటేనే ఆ సినిమాలలో నటిస్తానని తెలియజేశారు.సైఫ్ ఆలీ ఖాన్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే తాజాగా ఆయన నటించిన   తాండవ్‌ వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు.

తాండవ్‌ అనే వెబ్ సిరీస్ రాజకీయ డ్రామాకు సంబంధించినదే అయినప్పటికీ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యానాలు కొందరి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని వివాదం చెలరేగడంతో,ఉత్తరప్రదేశ్‌లో ఈ సిరీస్‌ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్, రచయిత గౌరవ్‌ సోలంకి, నటుడు జీషాన్‌ ఇంకా నిర్మాతల మీద కేసులు నమోదయ్యాయి.

ఈ విషయంలో సైఫ్ అలీ ఖాన్ పై నేరుగా కేసులు లేకపోయినా ఈ సిరీస్ లో నటించిన వారందరికీ అరెస్టు చేయకుండా రక్షణ కావాలని సుప్రీంకోర్టును అడగగా సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది.

ఈ విధంగా కొన్ని వివాదాస్పదమైన సినిమాలలో నటించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తన కొడుకు విషయంలో ఎంతో కంగారు పడుతున్న షర్మిలా టాగోర్‌కు, సైఫ్ రొటీన్ వేషాలు ఇష్టపడడు, తాను నటించే పాత్రలన్నీ ప్రత్యేకంగా భిన్నంగా ఉండాలని భావించి ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడని తన తల్లి పడుతున్నట్లు తెలియజేశారు.

తన తల్లి బాధను అర్థం చేసుకున్న సైఫ్ ఇకపై తాను నటించే సినిమా స్క్రిప్ట్ లను కూడా తన తల్లి విన్న తర్వాత ఒప్పుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు.

బాబు అల్లుడు కావడం ఎన్టీఆర్ దురదృష్టం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!