కెసీఆర్ టార్గెట్ గా దూసుకెళ్తున్న షర్మిల...కరువైన స్పందన

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ప్రభుత్వంపై ప్రతిపక్షాల దూకుడుతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తుతం అందరి టార్గెట్ గా ముఖ్యమంత్రి కెసీఆర్ మారిన పరిస్థితి ఉంది.అయితే అందరూ టార్గెట్ చేయడం ఒక ప్రక్కకు ఉంచితే వైయస్సార్ టీపీ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ప్రవేశించిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే షర్మిల రాజకీయ విధానంపై కనీసం ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించని పరిస్థితి ఉంది.

ఒకవేళ స్పందిస్తే కెసీఆర్ చేతిలో పావులుగా మారడం ఖాయం.తెలంగాణలో ఉంటూ ఆంధ్రా నాయకులకు మద్దతు పలుకుతున్నారంటే భవిష్యత్తులో తెలంగాణను మొత్తం మరల ఆంధ్రా వాళ్ళకు అప్పజెప్పే అవకాశం ఉందనే విషయాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.

అయితే తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తున్నా ఇటు అధికార పార్టీ నుంచి కానీ, కనీసం ప్రతిపక్ష పార్టీల నుండి కాని ఎటువంటి స్పందన రాలేని పరిస్థితి ఉంది.

అంతేకాక వరి ధాన్యం కొనుగోళ్లు చేయాలని రైతు వేదన దీక్ష చేపట్టినా కనీసం షర్మిల దీక్ష చేపట్టిన విషయం పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు.

ఏది ఏమైనా షర్మిలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టే అవకాశం లేకపోయినా ఏదో ఒక మూల మాత్రం షర్మిల కదలికలపై నిఘా ఉంచే అవకాశం ఉంది.

"""/"/ షర్మిల అప్పట్లో బహిరంగంగా చెప్పినా ఇప్పుడు అంతర్గతంగా చర్చించుకుంటున్న అంశం గుర్తింపు.

ఇంత పెద్ద పాదయాత్ర చేస్తున్నా రావలిసినంత గుర్తింపు రాలేదని, కనీసం మెజారిటీ మీడియాలో అసలు పాదయాత్ర విషయంపై కథనాలు ప్రసారం కావడం లేదని, మీడియా ద్వారానే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ప్రజల్లోకి వెళ్లకపోతే పార్టీ కార్యక్రమాలు చేసి ఉపయోగం లేదనే చర్చ షర్మిల పార్టీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా షర్మిల రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

58 నెలల కాలంలో పథకాలు అన్ని డోర్ డెలీవరీ..: సీఎం జగన్