వెయిటింగ్ లో షర్మిల ! పర్మిషన్ వస్తుందా ? 

ఏదో రకంగా తెలంగాణలో పట్టు సంపాదించేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

  అయినా ఆమెకి రాజకీయంగా అనుకూల పరిస్థితులు మాత్రం ఏర్పడడం లేదు.ఇప్పటికే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష షర్మిల చేపడుతున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, టిఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.

అయినా ఆమె పార్టీకి పెద్దగా మైలేజ్ అయితే వస్తున్నట్టు కనిపించడం లేదు.దీంతో ఆమె తెలంగాణ పాదయాత్రను మొదలుపెట్టారు.

ఈ యాత్రకు ఎన్నికల కోడ్ కారణంగా విరామం ప్రకటించారు.అయితే విరామం ప్రకటించినా, ఉద్యమాలు విషయంలో వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుని షర్మిల శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రైతులకు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్షలు చేపట్టాలని ముందుగా ప్లాన్ వేసుకున్నారు.

       కాకపోతే ఆమె దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆమె దానిని వాయిదా వేస్తున్నారు.

అయితే ఏదో రకంగా ఈ దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్న షర్మిల ఈ రోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంను దీక్షకు ఎంచుకున్నారు.

అయితే ఎన్నికల కోడ్  నేపథ్యంలో అక్కడ కూడా దీక్ష చేపట్టేందుకు షర్మిల పార్టీకి పర్మిషన్ లభించలేదు.

దీంతో తన దీక్షను శనివారం నుంచి చేపట్టేందుకు షర్మిల నిర్ణయం తీసుకున్నారు.శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద టిఆర్ఎస్ ధర్నా చేస్తుండడం కూడా షర్మిల ఇబ్బందికరంగా మారింది .

ఈ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉండడంతోనే షర్మిల పార్టీకి అనుమతి లభించలేనట్లు సమాచారం.

 ఏదో రకంగా తెలంగాణలో ఉద్యమాలు చేపడుతూ,  నిత్యం జనాల్లో ఉండాలని షర్మిల నిర్ణయించుకున్నారు.

    """/"/   ఈ నేపథ్యంలోనే  ఆమె 13 నుంచి నిరసన దీక్ష చేపట్టాలని చూసినా, దానికి అనుమతి లభించకపోవడంతో ఏదో రకంగా ఈ దీక్ష చేపట్టాలని షర్మిల చూస్తున్నారు.

రేపు ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టేందుకు అనుమతుల కోసం ఇప్పటికే షర్మిల పార్టీ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనికి పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.పోలీసుల అనుమతి లభించకపోతే రేపటి నుంచి లోటస్ పాండ్ నుంచి తన దీక్షను కొనసాగించాలనే ఆలోచనలో షర్మిల ఉన్నారు.

 .

బ్లాక్ బస్టర్ హిట్స్‌ను కొద్దిలో మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్స్‌.. ఎవరంటే..?