ఆంధ్ర కాంగ్రెస్ పగ్గాల పై షర్మిల గురి ?

వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన తెలంగాణ కు తిరిగి తీసుకొస్తానన్న హామీతో తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న షర్మిలకు ( YS Sharmila ) అక్కడ రాజకీయ వాతావరణం అంత అనుకూలించడం లేదు తెలంగాణలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలను వ్యతిరేకిస్తూ రాజకీయం చేస్తున్న ఆమెని తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదని తెలుస్తుంది .

ఎంత బలంగా ప్రయత్నించినా అక్కడ అనుకున్న బజ్ సాధించలేక పోతుంది.దాంతో వచ్చే ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించాలంటే పొత్తులు తప్పవని ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఆమె చూపు కాంగ్రెస్పై పడిందట.

కర్ణాటక ఎన్నికలలో భారీ విక్టరీ సాధించిన కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో మరొకసారి యాక్టివేట్ అవుతున్న సంకేతాల్లిచ్చింది .

దాంతో ఆ పార్టీతో కలిసి ముందుకు నడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం .

ఆ దిశగానే కర్ణాటక ఎన్నికల ఫలితాలపై డీకే శివకుమార్( DK Sivakumar ) కలిసి అభినందించి వచ్చిన ఆమె తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి చూస్తున్నారంటూ విశ్లేషణలు వస్తున్నాయి.

"""/" / మరోవైపు కాంగ్రెస్ ( Congress ) కూడా బారాస వ్యతిరేక వర్గాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు పోవాలని చూస్తుంది .

ముక్కోనపు పోటీలో ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతే అది మరోసారి అధికార పార్టీకి అనుకూలంగా మారుతుందని ఆలోచిస్తున్న కాంగ్రెస్ , కేసీఆర్ వ్యతిరేక పార్టీలు అన్నిటినీ కూడగట్టాలని చూస్తుంది.

ఇప్పటికే సిపిఐ వామపక్ష పార్టీలను ఆకర్షించడానికి చూస్తున్న కాంగ్రెస్ వైఎస్ఆర్ టిపిని కూడా కలుపుకోవాలని చూస్తుందట రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా ఆమెకు ఎంతో కొంత సానుభూతి ఉంటుందని అందువల్ల అది ఎన్నికల్లో కలిసి వస్తుందని కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తుంది """/" / ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మంచి పదవి హామీ ఇచ్చి చర్చలు చేస్తున్నారని తెలుస్తుంది అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పునరు వైభవం తీసుకువచ్చే బాధ్యతలు కూడా వైఎస్ షర్మిలాకే అప్పచెబుతారని, తద్వారా రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా కాంగ్రెస్కు పునర వైభవం తీసుకొచ్చే ఘనత తనకు దక్కుతుందని కూడా అంటున్నారు .

తన వీకెండ్ పలుకు లో ఆంధ్ర జ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కూడా ఈ దిశగా కొన్ని వాఖ్యలు చేశారు .

ఈ సింపుల్ రెమెడీతో పాదాలను తెల్లగా మృదువుగా మెరిపించుకోండి!