మంత్రి కేటీఆర్కు షర్మిల కౌంటర్
TeluguStop.com
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.
తొమ్మిదేళ్లుగా ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.కొలువులు ఇవ్వకుండా వందలాది మంది నిరుద్యోగుల ఉసురు తీశారని ఆరోపించారు.
ఆత్మహత్య చేసుకున్న ఒక్క కుటుంబాన్ని అయినా పరామర్శించారా అని ప్రశ్నించారు.ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని యువతను వంచించారన్నారు.
జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదలు చేయడం లేదో చెప్పాలన్నారు.ప్రశ్నాపత్రాలకు డిజిటల్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఐటీ మంత్రిగా మీ వైఫల్యం కాదా అని షర్మిల నిలదీశారు.
పాదయాత్ర ప్లాన్ లో కేటీఆర్ ! ?