పాపం షర్మిల ! ' వైఎస్ ' ప్లాన్ వర్కవుట్ కాలేదా ?

నిన్న వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సభను హైదరాబాదులో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ని వైయస్ సన్నిహితులు అందరికీ ఈ కార్యక్రమానికి హాజరు కావలసిదిగా వైఎస్.

విజయలక్ష్మి ఆహ్వానం పంపించారు.దాదాపు 350 మంది ప్రముఖులకు ఈ విధంగా ఆహ్వానాలు వెళ్లాయి.

ఈ సమావేశం పై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.వైఎస్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, రాజకీయంగా షర్మిల, జగన్ వేరు వేరు రూట్లలో వెళ్తుండటంతో వైఎస్ అభిమానులలోను గందరగోళం నెలకొంది.

అదీ కాకుండా వైఎస్ విజయమ్మ ఆహ్వానం మేరకు ఆ సమావేశానికి వెళ్లినా, జగన్ ఆగ్రహానికి గురికావాల్సి  వస్తుందేమో అన్న భయంతో వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు.

 ఈ సమావేశానికి హాజరైన నేతలు అతి తక్కువగా ఉండడంతో , ఈ సమావేశం తాలూకా అసలు ఉద్దేశం నెరవేరలేదు.

కేవలం అతి కొద్దిమంది మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావడంతో వైఎస్ సంస్మరణ సభ వెలవెలబోయింది.

వాస్తవంగా రాజకీయాలకతతంగా వైఎస్ అభిమానులు అందరూ ఒకచోట చేర్చి  సమావేశం నిర్వహించాలని విజయమ్మ భావించారు.

కాకపోతే వైఎస్ షర్మిల ఈ సమావేశాన్ని లీడ్ చేస్తుండడంతో, ఒకవేళ అక్కడ రాజకీయ ప్రసంగాలు చోటుచేసుకంటే తమ రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో చాలామంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

ఉండవల్లి అరుణ్ కుమార్ , కె.వి.

పి.రామచంద్రరావు,  రఘువీరా రెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి,  శ్రీశైలం గౌడ్ వంటి నాయకులు హాజరయ్యారు.

"""/"/ ఇక టాలీవుడ్ నుంచి ఎవరూ హాజరు కాకపోవడం,  మొత్తంగా  ఆత్మీయ సమావేశం ఫెయిల్ కావడం తో షర్మిల తీవ్ర నిరాశ చెందారట.

ఇప్పటికే వైఎస్సార్ టిపీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు , పెద్ద ఎత్తున నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలని షర్మిల ఆరాటపడుతుండగా, షర్మిల పార్టీలో చేరినా,  పెద్దగా ప్రయోజనం ఉండదు అని, తమ రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది నాయకులు వైఎస్సార్సీపీలో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

దీనికితోడు మొదట్లో ఉన్నంత మీడియా ఫోకస్ ఇప్పుడు ఆ పార్టీకి లేకపోవడం,  బయటకు వెళ్లే వారే తప్ప పెద్దగా చేరే వారు లేకపోవడం ఇలా ఎన్నో అంశాలు షర్మిలకు ఇబ్బందికరంగా మారాయి.

మెడ తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!