సొరచేపతో జూనియర్ ఎన్టీఆర్ ఫైట్.. ఆ సినిమాను మించేలా సీన్స్ ఉండనున్నాయా?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ( Junior NTR, Koratala Siva) కాంబినేషన్ లో రూపొందిన సినిమా దేవర.

ఇందులో జాన్వీ కపూ( Janhvi Kapoor)ర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం మూవీ మేకర్స్ అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు.కాగా తారక్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

అంతేకాకుండా తారకు కూడా తన ఇమేజ్ ని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. """/" / సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

అందులో భాగంగానే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ వార్త ఏమిటి అన్న విషయానికి వస్తే.దేవర మూవీలో సొరచేపతో ఎన్టీఆర్ తలపడే సన్నివేశం ఒకటి ఉందట.

అయితే మనలో చాలామందికి సొర చేపతో ఫైట్ అనగానే చత్రపతి సినిమా నేను గుర్తుకు వస్తూ ఉంటుంది.

</br """/" / 2005లో విడుదలైన చత్రపతి సినిమా( Chatrapathi)లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సమయంలో ఈ సుర చేప తో చేసిన ఫైట్ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు అదే తరహాలో దేవర లో సొరచేపతో ఎన్టీఆర్ తలపడే సన్నివేశాన్ని కొరటాల ప్లాన్ చేశారట.

సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథ కావడంతో కొరటాల ఈ ఫైట్ సీన్ ని ప్లాన్ చేశారని, అది కూడా ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన కొన్ని సెట్ ఫొటోలు లీకై ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

దీంతో సొరచేపతో ఎన్టీఆర్ ఫైట్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు.

కుర్చీ మడతబెట్టితో యూట్యూబ్ ను మడతబెట్టిన మహేష్ శ్రీలీల.. అన్ని వ్యూస్ వచ్చాయా?