షర్మిలకు చివరి ఆప్షన్ ఇచ్చిన కాంగ్రెస్?

గత కొన్ని రోజుల తర్వాత రోజులుగా కాంగ్రెస్తో వైఎస్ షర్మిల( Sharimila ) తెరవెనుక జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది.

రాజన్న వారసురాలిగా ఆమె చేరిక తెలంగాణ కాంగ్రెస్కు కొంత ఉపయోగం ఉంటుందనిబావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆమె ముందు అనేక ఆప్షన్స్ ఉంచిందని ఇంతకుముందు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆమె పార్టీని విలనం చేసుకోని తద్వారా ఏపీ కాంగ్రెస్ శాఖకు అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారంటూ విశ్లేషణలు వచ్చాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వెలుపెట్టి అన్నతో తలపడటం ఇష్టం లేని షర్మిల అందుకు ససేమిరా అంగీకరించలేదని తెలంగాణ పైనే తన రాజకీయ ఆసక్తులు ఉన్నాయని కాంగ్రెస్ అధిష్టానానికి తేల్చి చెప్పేసారని సమాచారం.

"""/" / అయితే తెలంగాణ కాంగ్రెస్( Congress Party ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) షర్మిల అసెంబ్లీ ప్రయాణానికి అంత సుముఖంగా లేరని ఇప్పుడు గనక ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఆయనను డీ మోర లైజ్ చేసినట్టు ఉంటుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం వేచి చూసే ధోరణి అవలంబించింది ఇక ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆమెకు సికింద్రాబాద్ ఎంపీ సీటును ఆఫర్ చేస్తున్నారని ఆంధ్ర సెటిలర్ ల ఓట్లతో పాటు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కూడా భారీ స్థాయిలో ఉన్న నియోజక వర్గం కావడంతో ఆమె గెలుపు లాంచనమే అవుతుందంటూ కూడా అధిష్టానం సూచించినట్లు తెలుస్తుంది .

"""/" / అయితే రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న షర్మిలకు ఈ ఆప్షన్ అంతగా నచ్చడం లేదని అయితే ఎన్నికలకు ఎక్కువగా సమయం లేకపోవడం తన పార్టీకి అనుకున్నంత గుర్తింపు కూడా రాకపోవడం తో తన రాజకీయ ప్రయాణం పై ఇప్పటికీ షర్మిలకు కు స్పష్టత రావడం లేదని తెలుస్తుంది .

తన సన్నిహితులు, రాజకీయ సలహాదారులతో చర్చించి మరి కొన్ని రోజుల్లోనే షర్మిల తన తదుపరి ప్రయాణాన్ని ప్రకటించబోతారని తెలుస్తుంది.

విజయ్ త్రిష మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు.. జస్టిస్ ఫర్ సంగీత అంటూ?