టెస్టు మ్యాచుల్లో శార్దూల్ స‌రికొత్త రికార్డు.. ఆ ఫీట్ చేసింది ఆయ‌నొక్క‌రే..

క్రికెట్‌కు మ‌న దేశంలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక క్రికెట్ అంటే ఎక్కువ‌గా కొంద‌రు మాత్ర‌మే గుర్తుకు వ‌స్తారు.

ఎందుకంటే వారికే ఎక్కువ‌గా రికార్డులు ఉంటాయి.ముందుగా వారే బ్యాటింగ్‌కు దిగుతుంటారు కాబ‌ట్టి వారికి అంత ప్రాధాన్య‌త ఉంటుంది.

ఇక క్రికెట్ టీంలో సాధార‌ణంగా ఎనిమిది లేదంటే తొమ్మిది స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే.

అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ ఇరగదీసే క్రికెటర్లు చాలా అరుదుగా క‌నిపిస్తూ ఉంటారు.

ఇక జ‌ట్టులో చివరి ముగ్గురు బ్యాట్స్ మెన్లు అత్యుత్తమైన వారుగా ఉండాలంటే క‌ష్ట‌మే అని చెప్పాలి.

కాగా ఎక్కువ మ్యాచుల్లో మ‌నం చూస్తున్నంత వ‌ర‌కు ఐదుగురు లేదంటే ఆరుగురు బ్యాట్స్ మెన్లే విజ‌య తీరాల‌కు చేరుస్తారు జ‌ట్టును.

అంతకు మించిన బ్యాట్స్ మెన్ల‌పై జ‌ట్టు పెద్ద‌గా ఆధార‌ప‌డ‌దు.ఒక వేళ ఆధార ప‌డినా కూడా ఆ టైంలో బరిలోకి వ‌చ్చే వాళ్లు ముందు వ‌రుస‌గా ఉండే వారితో స‌మానంగా రాణించటం చాలా తక్కువే అని చెప్పాలి.

కాగా ఇప్పుడు ఇలాంటి అద్భుతాన్ని చేసి చూపించారు టీమ్ ఇండియా క్రికెట‌ర్ శార్దూల్ ఠాకూర్.

ఏంటంటే ఇప్పున‌డు ఇంగ్లండ్ లో జరుగుతున్న టీమ్ ఇండియా టెస్టు మ్యాచ్ లో ఆయ‌న కూడా ఆడుతున్నారు.

అయితే ఆయ‌న ఇప్పుడు ఎనిమిదో బ్యాట్ష్ మెన్ గా దిగినా కూడా త‌న బ్యాటింగ్ తీరుతో అద‌ర‌గొట్టేశాడు.

అదేంటంటే మొదట ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్లు అంద‌రూ కూడా ఫెయిల్ అయినా స‌రే ఎనిమిదో స్థాయిలో దిగిన శార్దూల్ 37 బంతులు ఎదుర్కొని ఏకంగా మూడు సిక్సర్లతో పాటు ఏడు ఫోర్ల‌తో 46 పరుగులు చేసి దుమ్ము లేపేశాడు.

ఇక ఆ త‌ర్వాత 72 బంతుల ఆడి ఏకంగా 60 పరుగులు చేయడం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది.

దీంతో టీమిండియా ఇప్ప‌నుడు ఇంగ్లాండ్ మీద 336 పరుగుల అధిక్యంలో దూసుకుపోతోంది.కాగా ఇలాంటి అరుదైన రికార్డును 2010లో హర్భజన్ సింగ్ సాధించ‌గా ఆ త‌ర్వాత 2016లో వృద్ధిమాన్ సాహా త‌ర్వాత ఇప్పుడు శార్దూల్ ఇలాంటి రికార్డును సాధించారు.

ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!