వెన్నుపోట్లు మనకు కొత్త కాదు :శరద్ పవార్?
TeluguStop.com
నేషనల్ కాంగ్రెస్ పార్టీ కి(ఎన్సిపి) వెన్నుపోటు పొడిచి ఏక నాద్ షిండే తో( Eknath Shinde ) జతకట్టి, ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన అజిత్ పవార్( Ajith Pawar ) వైఖరిపై ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్( Sharad Pawar ) ఎట్టకేలకు స్పందించారు.
మహారాష్ట్ర లోనే కాకుండా దేశం మొత్తం కులం మతం ప్రాంతీయ బావాలు రెచ్చగొడతూ ఒక పార్టీ విద్వేషాలురాజకీయాలకు వెన్నుపోట్లకు తెరతీస్తుందని ఆయన విమర్శించారు.
కొన్ని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి వాటికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని భాజపాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు .
అంతేకాకుండా వెన్నుపోట్లు మనకు కొత్త కాదని మన పార్టీ పెట్టిన 1980లో 588 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చివరకు ఆరుగురు మిగిలారని అయినా కూడా మొక్కవోని పట్టదలతో తాను పార్టీని పునర్ నిర్మించాలని తనకు వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారంతా ఆ తరువాత ఎన్నికలలో ఓడిపోయారని ఆయన కార్యకర్తలకు ధైర్యం నూరి పోశారు.
"""/" /
నాయకులు మారిపోయినా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలంతా తనతో ఉన్నారని పార్టీ మారిన అజిత్ పవర్ పై తీసుకోవలసిన క్రమశిక్షణ చర్యలపై పార్టీ జూలై 6 ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయం తీసుకుందామని ఆయన కార్యకర్తలకు తెలియజేశారు.
ప్రజలకు సేవ చేసేందుకు కాకుండా పదవి అధికారాల కోసం నాయకులు పార్టీలు మారే పరిస్థితి రావడం శోచనీయమంటూ ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
దేశవ్యాప్తంగా భాజాపాను( BJP ) ఓడించడానికి ప్రయత్నాలు తన ఆధ్వర్యంలో ముమ్మరంగా జరగడంతోనే తనను బాజాపా టార్గెట్ చేసిందని ఆయన కార్యకర్తలతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది.
"""/" /
ఏది ఏమైనప్పటికీ తన ప్రయత్నాలు ఆపనని భాజాప వ్యతిరేక పార్టీలన్నిటిని ఏకీకరణ చేస్తానని భాజపాను గద్దదించే ప్రయత్నం చేస్తానని ఆయన కార్యకర్తలతో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి 53 మంది సభ్యులు ఉన్న ఎన్సీపీలో( NCP ) 8 మంది అజిత్ వెంట నడవగా 44 మంది మిగిలారు అయితే అజిత్ తనతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు తనకు ఉందని ప్రకటించడంతో ఎవరిపెంట ఎంత ఉన్నారో తెలియని గందర గోల పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడింది అని తెలుస్తుంది.
బ్రెజిల్ జాతీయ చిహ్నం ఈ కుక్కలే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!