మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌లో రచ్చ చేసిన షణ్ముక్..

షణ్ముక్ జశ్వంత్.ఈ పేరు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యింది.

ఒక్క వెబ్ సిరీస్ తో యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు.ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే నిముషాల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చేవి.

ఎప్పుడు ఏ వీడియో పెట్టిన ట్రెండింగ్ లో ఉండేది.అంత పాపులర్ అయ్యి లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్న షణ్ముక్ జశ్వంత్ ఒక్క చిన్న తప్పుతో పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ మధ్య సూర్య అనే కొత్త వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసాడు.

ఈ వెబ్ సిరీస్ కూడా మిలియన్ల మంది చూస్తున్నారు.వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన షణ్ముఖ్ ఈ మధ్యే టీవీ ఛానెల్స్ లో కూడా కనిపిస్తున్నాడు.

ఇంత మంచి గుర్తింపు తెచ్చుకుని నాలుగు సంవత్సరాలుగా పడుతున్న కష్టానికి ప్రతిఫలం రాబోతుంది అనగా మద్యం మత్తులో కారు నడిపి కేసులో చిక్కుకున్నాడు.

తాగి డ్రైవ్ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చి మూడు వాహనాలను ఢీ కొట్టడంతో స్థానికులు అతడి కారును ఆపి పోలీసులకు సమాచారం అందించారు.

జూబ్లీహిల్స్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని షణ్ముఖ్ ను అదుపులోకి తీసుకున్నారు.స్టేషన్ లో మద్యం మత్తులో ఉన్న షణ్ముఖ్ నానా రభస చేసాడు.

తనకు యూట్యూబ్ లో చాలా ఫాలోయింగ్ ఉందని ఒక్కో వీడియోని కోట్లమంది చూస్తారని వ్యాఖ్యలు చేసాడు.

Iv """/"/ అంతేకాదు షణ్ముఖ్ పోలీసులకు కొందరి చేత ఫోన్లు చేయించేందుకు కూడా ప్రయత్నించాడని.

అలాగే డబ్బులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని అయితే పోలీసులు మాత్రం ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది.

మద్యం తాగి వాహనం నడిపి మూడు కార్లను ఢీ కొట్టడమే కాకుండా ఎవరికీ ఏమి కాలేదు కదా.

అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు తెలుస్తుంది.షణ్ముఖ్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ లో చెక్ చేస్తే ఏకంగా 180 చూపించినట్లు వార్తలు వస్తున్నాయి.

పోలీసులు వంద దాటితేనే ఫైన్ వేసి, అరెస్ట్ చేస్తారు మరి 180 వచ్చిందంటేనే అర్ధం అవుతుంది అతడు ఎంత తాగాడో అని.

తాగి డ్రైవ్ చేసినందుకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసారు.అంతేకాదు తన కారును డామేజ్ చేసాడని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.తాగి డ్రైవ్ చెయ్యొద్దని పోలీసులు ఎంత చెబుతున్న ఇలాంటి ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పటికీ మనస్పూర్తిగా నవ్వని అల్లు అర్జున్.. ఆ ట్రోల్స్ వల్లే ఇలా చేస్తున్నాడా!