మాజీ గర్ల్ ఫ్రెండ్ కు బర్త్ డే విష్ చేసిన షణ్ముఖ్.. దెబ్బకు సైలెంట్ అయిపోయిన దీప్తి సునయన?
TeluguStop.com
బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ దీప్తి సునయన.
ఈమె గురించి సోషల్ మీడియా ప్రియులకు బాగా తెలుసు.మొదట్లో డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది దీప్తి.
ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించింది.
అలా బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.
ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అంతేకాకుండా సింగర్ గా కూడా బాగా మెప్పించింది.ఇక దీప్తి సునయన మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.
ఇక వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.దీంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.
కొంతకాలం వరకు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నట్లు అందరినీ నమ్మించారు.కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని.
అంతేకాకుండా టాటులు కూడా ఒకేలా వేయించుకోవటంతో బాగా అనుమానాలు రావడంతో బిగ్ బాస్ సీజన్ 5 తో నిజమైంది.
"""/"/
పలు బుల్లితెర షో లలో కూడా వీరిద్దరు జంటగా పాల్గొని బాగా రచ్చరచ్చ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే సీజన్ 5 లో షణ్ముఖ్ మరో కంటెస్టెంట్ సిరితో మితిమీరి ప్రవర్తించాడు.
దీంతో నెగిటివిటిని మూటగట్టుకున్నాడు.ఆల్రెడీ దీప్తి సునయన తో లవ్ లో ఉన్నాడు.
ఓసారి దీప్తి సునయన కూడా అదే వేదికపై షణ్ముఖ్ కు లవ్ ప్రపోజల్ కూడా చేసింది.
దీంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అందరికీ క్లారిటీ వచ్చింది.అయినా కూడా షన్ను సిరితో మితిమీరి హద్దులతో ప్రవర్తించడంతో బాగా విమర్శలు ఎదుర్కొన్నాడు.
అంతేకాకుండా షో నుండి బయటికి వచ్చాక దీప్తి సునయనను దూరంగా ఉంచటంతో.దీప్తి అస్సలు నిర్ణయాన్ని తీసుకుంది.
ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఇక ఆరోజు నుంచి దీప్తి బాగా ఎమోషనల్ గా ఉంటుంది. """/"/
సోషల్ మీడియా వేదికగానే తాను రిఫ్రెష్ అయ్యింది.
నిత్యం ఏదో ఒక పోస్టులు షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే దీప్తి, షన్ను విడిపోయి రెండు సంవత్సరాలు కాగా ఇప్పటికీ వీరు కలుస్తారేమో అని తమ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా షన్ను పెట్టిన పోస్ట్ వల్ల వీరిద్దరూ కలుస్తారేమో అన్న ఆశలు వస్తున్నాయి.
ఈరోజు దీప్తి పుట్టినరోజు సందర్భంగా షన్ను తన ఇన్ స్టా లో హ్యాపీ బర్త్డే డి అంటూ షేర్ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.
అయితే ఎప్పుడు స్టోరీస్ పెట్టేది దీప్తి ఈరోజు స్టోరీస్ పెట్టకపోవడంతో అందరిలో అభిమానాలు మొదలయ్యాయి.
అంటే షన్ను పెట్టిన పోస్టుకు తిరిగి స్పందించాల్సి వస్తుందేమో అని ఈరోజు స్టోరీస్ పెట్టలేదని తెలుస్తుంది.
ప్రస్తుతం షన్ను పెట్టిన స్టోరీ బాగా వైరల్ అవుతుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి7, మంగళవారం 2025