‘RC15’ అప్డేట్.. ఓల్డ్ సిటీలో సాంగ్ షూట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో అగ్ర డైరెక్టర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

మావెరిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ తో చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాడు.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి. """/"/ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'RC15'.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాయో అందరికి తెలుసు.

మరి అలాంటి శంకర్ ఆయన సినిమాలో ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు.

"""/"/ చిన్న సీన్స్ దగ్గర నుండి డ్యాన్స్, పాటలు, సెట్స్ ఇలా ప్రతీ విషయంలో కోట్లు ఖర్చు పెట్టి అయినా పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దుతాడు.

అందుకే ఈ సినిమాకు కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.

మిగతా పార్ట్ కూడా శరవేగంగా చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా షూట్ అప్డేట్ బయటకు వచ్చింది.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ ను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రేపు స్టార్ట్ చేయనున్నారని అది కూడా ఒక పాటను చిత్రీకరించ బోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ పాట షూట్ తర్వాత మిగతా పార్ట్ ను వైజాగ్ ఇంకా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూట్ చేయనున్నారట.

ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హోస్ట్ గా భారీ రియాలిటీ షో.. అలా మిస్ అయ్యిందా?