RC15 : చరణ్ ఎంట్రీ సీన్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేస్తున్న శంకర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని స్టార్ అయ్యాడు.

ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలు నిజం అయ్యేలా బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచి 1100 కోట్లు కొల్లగొట్టింది.

ఈ సినిమాతో హిట్ కొట్టిన రామ్ చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.

ఇండియన్ అగ్ర దర్శకులు అయినా రాజమౌళి, శంకర్ లతో ఈయన బ్యాక్ టు బ్యాక్ పని చేస్తూ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఇలా ఇప్పుడు ఉన్న స్టార్ దర్శకులిద్దరితో పని చేసిన ఘనత ఈయనకే సొంతం.

కాగా మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇటీవలే అమృత్ సర్ లో, ఆపై వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.

ఇక త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది.మరి ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని శంకర్ కూడా కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అలాగే రామ్ చరణ్ లుక్ లో కూడా విభిన్నంగా చూపించ నున్నట్టు తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన లుక్ విషయంలో మాత్రమే కాదు ఈయన ఎంట్రీ విషయంలో కూడా శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

"""/" / ఇంతకు ముందు ఈ సినిమా ఇంటర్వెల్ కోసం 15 కోట్లు ఖర్చు చేసారని.

క్లైమాక్స్ కోసం 30 కోట్లు ఖర్చు చేసారని.పలు రకాల వార్తలు వైరల్ అయినా విషయం తెలిసిందే.

అయితే తాజాగా చరణ్ ఎంట్రీ సీన్ విషయంలో ఒక వార్త వైరల్ అయ్యింది.

ఈ ఎంట్రీ సీన్ కోసం శంకర్ స్పెషల్ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేయించారట.

దీని కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసారని.చరణ్ ఎంట్రీ సీన్ ను చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడని టాక్ బయటకు వచ్చింది.

మరి దీనిని బట్టి చూస్తే ఈ సినిమాలో చరణ్ రోల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా పవర్ ఫుల్ గా ఉంటాయని తెలుస్తుంది.

మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి బ్యాటరీ ఉండే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!