రామ్ చరణ్ సినిమాలో 'ఐ' విలన్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.

ఆర్ తర్వాత శంకర్ డైరక్షన్ లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియరా అద్వాని నటిస్తుంది.సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో విలన్ గా మళయాళ స్టార్ సురేష్ గోపీ నటిస్తారని టాక్.

ఆల్రెడీ శనక్ర్ ఐ సినిమాలో సురేష్ గోపీ నటించి మెప్పించారు.ఆ సినిమా టార్గెట్ మిస్సైనా సరే మరోసారి సురేష్ గోపీని సెలెక్ట్ చేశారు.

తెలుగులో సురేష్ గోపీ సినిమాలు వచ్చాయి.ఇక్కడ ఆయనకు మంచి క్రేజ్ ఉంది.

చరణ్ సినిమాలో సురేష్ గోపీ విలన్ అనగానే సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా సాంగ్ కోసమే కోట్ల కొద్దీ బడ్జెట్ పెట్టేస్తున్నాడట శంకర్.

మరి శంకర్ సినిమా అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా చెప్పండి.కచ్చితంగా శంకర్ ఈ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

ఐ, 2.O సినిమాలు నిరాశపరచడంతో ఎలాగైనా సరే చరణ్ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు శంకర్.

ర‌క్త‌దానం ప్ర‌యోజ‌నాలేంటి.. ఎవ‌రు చేయాలి? ఎవ‌రు చేయ‌కూడ‌దు?