ఆర్సీ15 నెక్స్ట్ షెడ్యూల్.. స్పీడ్ తగ్గేదేలే అంటున్న చరణ్!

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా హిట్ తో చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.దీంతో ఆయన తర్వాత సినిమా షూటింగ్ కూడా అదే జోష్ లో చేస్తున్నాడు.

చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు చరణ్ ఆచార్య సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా ఉండడంతో ఆయన తర్వాత సినిమాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూడా నటించారు.అయితే ఈ సినిమా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు.

కొరటాల మార్క్ కనిపించక పోవడంతో ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

ప్లాప్ అయ్యింది. """/" / అయినా కూడా చరణ్ స్పీడ్ తగ్గించడం లేదు.

ఈ సినిమా ప్రొమోషన్స్ పూర్తి అవవడంతో వెంటనే శంకర్ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇక శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.

ఈయన సినిమాలు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.

ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది.అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయట.

మే 5 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అవ్వనుందని అక్కడ చరణ్ తో పాటు ముఖ్యమైన తారాగణం పై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించ నున్నారని సమాచారం.

ఇలా చరణ్ బ్రేకులు లేకుండా షూటింగ్ జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నాడు.

మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?