రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్థాయి లో స్టార్ అయ్యాడు.
ఆయన తదుపరి సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుతం శంకర్ సినిమా ను రూపొందిస్తున్నాడు.
ఆర్ సీ 15 సినిమా విషయమై రోజుకు ఒక వార్త వస్తూ సినిమా పై అంచనాలను భారీ గా పెంచేసిన విషయం తెల్సిందే.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక భారీ యాక్షన్ సన్నివేశం కోసం వంద మంది ఫైటర్స్ ను మరియు రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులను భారీ టెక్నికల్ టీమ్ ను రెడీ చేసుకున్న తర్వాత షూటింగ్ ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందట.
ఇటీవల ఒక వివాదం కారణంగా ఆ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.
దాంతో ఇప్పుడు ఆ షెడ్యూల్ ను మళ్లీ ప్లాన్ చేయడం కోసం భారీ మొత్తం ఖర్చు అవుతుందట.
అంతే కాకుండా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని అంటున్నారు.మళ్లీ అంత మంది ఫైటర్స్ మరియు జూనియర్ ఆర్టిస్టులు సమకూర్చడానికి చాలా సమయం పడుతుందని ప్రొడక్షన్ టీమ్ అన్నారట.
దాంతో మరో సన్నివేశాన్ని చేయలేక.ఆ సన్నివేశం వెంటనే చేయలేక దర్శకుడు శంకర్ జుట్టు పీక్కుంటున్నట్లుగా తెలుస్తోంది.
రామ్ చరణ్ ఈ సినిమా ను ఆగస్టు లేదా సెప్టెంబర్ కు పూర్తి చేసి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఇదే ఏడాది చివరి వరకు సినిమా ను మొదలు పెట్టాలి అనుకున్నాడు.
కాని పరిస్థితి చూస్తుంటే అలా జరిగే పరిస్థితి లేదు.హీరోగా రామ్ చరణ్ కు ఈ సినిమా అత్యంత కీలకం.
అందుకే శంకర్ ఎక్కువ కష్టపెట్టినా కూడా చరణ్ భరిస్తున్నాడు.కాని ఏదో ఒక సమస్య కారణంగా షూటింగ్ ఆలస్యం అవ్వడం లేదంటే మరేదైనా సమస్య రావడం జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ యాప్స్ ప్రమోట్ చేయాలని 3 కోట్ల ఆఫర్.. శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు వైరల్!