శంకర్ చరణ్ ప్రాజెక్ట్ లాంచ్ కి గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరంటే ?
TeluguStop.com
రామ్ చరణ్ శంకర్ కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.
మొదటిసారి దిల్ రాజు పెద్ద బడ్జెట్ సినిమా చేయడం.ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతుంది.
త్వరలోనే ఈ సినిమా షూట్ ను పూజ కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాను సెప్టెంబర్ 8న గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ రోజు గెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోను డైరెక్టర్ శంకర్ తీసుకు రాబోతున్నాడని టాక్.
అది కూడా హిందీలో అపరిచితుడు రీమేక్ చేయబోతున్న స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ను శంకర్ ఈ సినిమా లాంచ్ రోజు గెస్ట్ గా తీసుకు రాబోతున్నాడట.
ఇదే కనుక నిజమైతే శంకర్ ఈ సినిమా మొదలు పెట్టిన రోజునే పాన్ ఇండియా లెవల్లో ఫ్రీ పబ్లిసిటీ కూడా అయిపోతుంది.
మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ అదే నిజమైతే ఈ సినిమా ప్రొమోషన్ పరంగా బాగా ఉపయోగపడుతుంది.
"""/"/ ఇక రామ్ చరణ్ ఈ మధ్యనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ముగించుకుని శంకర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.
"""/"/
ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
ఇక రామ్ చరణ్ ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో చిరంజీవి సరసన కాజల్, చరణ్ కు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు.
ఇక త్వరలోనే ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
అల్లుఅర్జున్ పాటకు రోడ్డుపై బైకర్లు డ్యాన్స్.. వీడియో వైరల్