చరణ్ ప్రాజెక్ట్ కొత్త పోస్టర్ రిలీజ్.. శంకర్ మ్యాజిక్ స్టార్ట్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూట్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అందులోను ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ ఇద్దరు కనిపించి అభిమానులను కనువిందు చేయబోతున్నారు.

ఇక రామ్ చరణ్ ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో చిరంజీవి సరసన కాజల్, చరణ్ కు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఇక త్వరలోనే ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ ను ఈ రోజు భారీ లెవల్లో లాంచ్ చేయబోతున్నారు. """/"/ ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ను పూజ కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నట్టు టాక్.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ఒక సాలిడ్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు.

ఈ పోస్టర్ ఎంతో ఆసక్తిని రేపుతోంది.అంతేకాదు చాలా రోజుల తర్వాత శంకర్ మ్యాజిక్ ఈ పోస్టర్ లో కనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

"""/"/ ఇది వెంటనే చుస్తే రోబో లాగా అనిపిస్తుంది కానీ ఇందులో శంకర్ పనితనం కనిపిస్తుంది.

ఈ పోస్టర్ లో రామ్ చరణ్ తో పాటు శంకర్ కియారా అద్వానీ కూడా కనిపిస్తున్నారు.

అంతేకాదు ఈ పోస్టర్ లో ఒకే కాస్ట్యూమ్ తో సినిమా క్యాస్ట్ మొత్తం ఈ ఒక్క పోస్టర్ లోనే కనిపిస్తున్నారు.

మొత్తానికి ఒక్క పోస్టర్ తో ఈ సినిమాను వేరే లెవల్లో ప్రెసెంట్ చేసాడు శంకర్.

మరి నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కొత్త సెట్ వేస్తున్నారా..?