ఆంజనేయ స్వామి తోక పట్టుకున్న శనీశ్వరుడు..ఏలినాటి శని ఏమి చేయలేదా..?

ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.

అలాగే మన దేశంలో ప్రతి గ్రామంలో ఆంజనేయుడి దేవాలయం కచ్చితంగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామి( Anjaneya Swami ) మూల నక్షత్రంలో జన్మించాడు.

ఒక సారి శని దేవుడు ఆంజనేయుడిని పట్టుకోడానికి వచ్చాడు.ఆ సమయంలో ఆంజనేయుడు శ్రీరాముడిని పూజిస్తే తనను తాను మరిచిపోయి కీర్తనలు పడుతూ ఉంటాడు.

అప్పుడు బయట వేచి ఉన్న శని దేవుడు ఆంజనేయుడి తోకను చూడగానే ఆయన తోక పై కూర్చుని గట్టిగా పట్టుకుంటాడు.

"""/" / శని దేవుడిని ఎలా తరిమికొట్టాలి అని ఆంజనేయుడు కొంత సేపు ఆలోచిస్తాడు.

ఆ తర్వాత రాముడిని స్తుతిస్తూ గెంతుతూ గెంతుతూ ఎగురుతూ ఎగురుతూ పూజించడానికి నిర్ణయించుకుంటాడు.

దీని కారణంగా తోక చివర ఉన్న శని దేవుడికి ( Lord Shani )శరీరంలో నొప్పి వస్తుంది.

అప్పటికి కూడా ఆంజనేయుడు దూకడం ఆపలేదు.దీంతో శని దేవుడు ఎప్పుడు దూకడం మానేస్తావు అని అడుగుతాడు.

అది విన్న హనుమంతుడు ఏడున్నర ఏళ్ల పాటు దూకుతూనే ఉంటాను అంటాడు.అప్పుడు శని దేవుడు భయపడతాడు.

"""/" / శని దేవుడు ఆంజనేయుడుని పట్టుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఉండదని భావించి ఆంజనేయుడిని విడిచి పెట్టాలని నిర్ణయించుకుంటాడు.

అప్పుడు ఆంజనేయస్వామి కూడా చాలా సంతోషించి శని దేవుడిని ప్రార్థిస్తాడు.శనీశ్వర నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని భావించావు కాబట్టి నన్ను పూజించే నా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దు అని అభ్యర్థిస్తాడు.

అప్పుడు శని దేవుడు ఆంజనేయ స్వామి మాటలను అంగీకరిస్తాడు.కాబట్టి అష్టమ శని సమయంలో ఆంజనేయున్ని పూజిస్తే ఈతి బాధలు ఉండవు అని పండితులు చెబుతున్నారు.

శని దేవుని బాధల నుంచి విముక్తి పొందాలంటే ఆంజనేయుడిని శనివారం పూజించాలని పండితులు చెబుతున్నారు.

చదువులో టాపర్.. రూ.60 లక్షల ప్యాకేజీతో జాబ్.. ఇతని సక్సెస్ కు వావ్ అనాల్సిందే!