లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ కుక్కను చైనాలో ఎలా వేలాడదీస్తున్నారో చూడండి..!

చైనా మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంది.ఇప్పుడు డ్రాగన్ కంట్రీలో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వం కఠినమైన కోవిడ్-19 నియంత్రణ చర్యలు చేపడుతోంది.ప్రధాన నగరాల్లో కఠినమైన లాక్‌డౌన్‌లు అమలు చేస్తోంది.

సిటీల్లో ఉండే జనాల్ని మెటల్ బాక్సులలో నిర్బంధిస్తోంది.అలాగే చాలా మందిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధిస్తోంది.

వీటిలో భాగంగా ఈ దేశం పెంపుడు కుక్కలను వాకింగ్ చేయించే వెసులుపాటును కూడా ప్రజలకు ఇవ్వడం లేదు.

మరీ ముఖ్యంగా షాంఘైలో విధించిన లాక్‌డౌన్ మనుషులకు ఒక నరకంలా మారింది.ఇక్కడ పెంపుడు కుక్కల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.

వైరస్ సోకుతోందేమోననే భయంతో చైనా ఆరోగ్య కార్యకర్తలు పెంపుడు కుక్కలను, హాంకాంగ్‌లోని పెంపుడు చిట్టెలుకలను కనికరం లేకుండా చంపేస్తున్నారు.

ఈ క్రమంలోనే అక్కడి హృదయవిదారకమైన దృశ్యాలకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇందులోని ఒక వీడియో చైనాలోని పెంపుడు జంతువుల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ఈ వీడియోలో ఒక చైనీస్ వ్యక్తి తన పెంపుడు కుక్కకు తాడు కట్టి దాన్ని అపార్ట్‌మెంట్‌ కిటికీ నుంచి నెమ్మదిగా క్రిందికి దించుతున్నట్లు చూడొచ్చు.

"""/"/అతడు అపార్ట్‌మెంట్‌ పైనే ఉండి కేవలం కుక్కని మాత్రమే ఇంటి ముందు జాగ్రత్తగా దించడం కూడా గమనించొచ్చు.

ఆ తరువాత ఈ ఓనర్ తన శునకాన్ని కాసేపు వాకింగ్ చేయించాడు.ఈ వాకింగ్ చేయించడమంతా పైనుంచే జరిగింది.

కాసేపటికి దాన్ని మళ్లీ పైక్కి లాగేసాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కుక్కను వేలాడదీస్తూ కిందకి దింపడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇది యానిమల్ క్రూయల్టీ అని వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే చైనీస్ ప్రజలకు మరోదారి లేదని మరికొందరు ఈ వీడియోలోని వ్యక్తికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

దీన్ని మీరు కూడా చూసేయండి.

రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటే ఇది తప్పక తెలుసుకోండి!