తమ్ముడిని చంపించిన యంగ్ హీరోయిన్.. కారణమేంటంటే..?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
లవ్ ఎఫైర్ కు తమ్ముడు అడ్డొచ్చాడని ప్రముఖ నటి సొంత తమ్ముడినే చంపించారు.
కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.పూర్తి వివరాల్లోకి వెళితే శాండిల్ వుడ్ సినిమాల్లో నటించి శనయా కట్వే నటిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఒందు గంటేయ కథ, సినిమాతో పాటు పలు సినిమాల్లో ఈమె నటించారు.శనయా గత కొన్ని నెలల నుంచి నియాజ్ అహ్మద్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు.
తరచూ వీళ్లిద్దరూ బయట తిరిగుతున్న విషయం శనయా తమ్ముడు రాకేష్ కు తెలిసింది.
నియాజ్ పలువురు సెలబ్రిటీలకు మేనేజర్ గా పని చేసేవారు.రాకేష్ తన సోదరి శనయాను పద్ధతి మార్చుకోమని పలుమార్లు సూచించినా ఆమె పద్ధతిని మార్చుకోలేదు.
తమ్ముడి హెచ్చరికలతో భయపడిన శనయా ఆమె ప్రియుడికి ఆ విషయాన్ని వెల్లడించారు.ఆ తరువాత ఇద్దరూ కలిసి రాకేష్ ను అడ్డు తొలగించాలని అనుకున్నారు.
ఆ తరువాత నియాజ్ రాకేష్ ను చంపడంతో పాటు అతని శరీర భాగాలను వేరు చేసి హుబ్బళిలో ఉన్నటువంటి వేర్వేరు ప్రాంతాలలో విసిరేయడం జరిగింది.
రాకేష్ శరీర భాగాలను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నియాజ్ ను అరెస్ట్ చేశారు.
ఈ హత్య కేసులో హీరోయిన్ శనయా పాత్ర కూడా ఉందని భావించి పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు.
సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ ఈ విధంగా చేశారని తెలిసి ఆమె అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.
ఈ కేసులో హీరోయిన్ శనయాకు, నియాజ్ కు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాల్సి ఉంది.
విశ్వక్ సేన్ డైరెక్టర్ గా మరో సినిమా.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!