ప్రతివారం ఈ విధంగా షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్ కు ఆమడ దూరంలో ఉండవచ్చు!

హెయిర్ ఫాల్( Hair Fal )అనేది అందరిలో ఉండే సమస్యే అయినప్పటికీ కొందరిలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది.

పర్యావరణ కాలుష్య కారకాలు లేదా సరైన జుట్టు సంరక్షణ లేక‌పోవ‌డం కారణంగా కురులు అధికంగా రాలిపోతూ ఉంటాయి.

అధిక హెయిర్ ఫాల్ కారణంగా జుట్టు రోజు రోజుకు పల్చగా తయారవుతుంది.అయితే ఊడిపోయే జుట్టును చూసుకుంటూ బాధపడడం మానేసి సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టండి.

"""/" / ముఖ్యంగా ప్రతివారం ఇప్పుడు చెప్పబోయే విధంగా షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్ కు ఆమడ దూరంలో ఉండవచ్చు.

అందుకోసం ముందుగా ఒక గ్లాసు అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని( Porridge ) తీసుకోవాలి.

అన్నం గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.అవి మన జుట్టు ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

ఒక గ్లాసు అన్నం గంజిలో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ), వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్( Glycerin ), హాఫ్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ( Coconut Oil )మరియు నాలుగు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను వేసి మరోసారి కలుపుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ న్యాచురల్ షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

ప్రతివారం ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం అనేది చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.

అదే సమయంలో జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.జుట్టు విర‌గ‌డం, రాల‌డం, చిట్ల‌డం వంటివి తగ్గు ముఖం పడతాయి.

అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ ను ఇందులో ఉప‌యోగించ‌డం వల్ల చుండ్రు, తలలో దురద వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.

స్కాల్ప్ హెల్తీ గా మారుతుంది.కాబట్టి జుట్టు రాలడాన్ని అడ్డుకోవాల‌ని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!