వారంలో 2 సార్లు ఇలా షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్ దూరం!

హెయిర్ ఫాల్‌.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రినో తీవ్రంగా మ‌ద‌న పెట్టే స‌మ‌స్య ఇది.

జుట్టు రాల‌డానికి అంద‌రిలోనూ ఒకే కార‌ణాలు ఉండ‌వు.ఒక్కొక్క‌రిలో ఒక్కో కార‌ణం చేత జుట్టు ఊడిపోతూ ఉంటుంది.

రీజ‌న్ ఏదైనా హెయిర్ ఫాల్‌ను అడ్డుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.త‌ర‌చూ హెయిర్ ప్యాకులు, మాస్కులు వేసుకుంటారు.

ఖ‌రీదైన ఆయిల్స్ వాడుతుంటారు.అయినా స‌మ‌స్య అదుపులోకి రాకుంటే మందులు కూడా వాడ‌తారు.

అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే వారానికి రెండు సార్లు ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాల‌డాన్ని సుల‌భంగా అరిక‌ట్ట‌వ‌చ్చు.

మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ. """/" / ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకుని పీల్ తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉల్లిపాయ జ్యూస్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ ఇన్‌స్టెంట్ కాఫీ పౌడ‌ర్‌, మూడు టేబుల్ స్పూన్ల రైస్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల మీ రెగ్యుల‌ర్ షాంపూను వేసి మ‌ళ్లీ క‌లుపుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మంతో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్ దూరమ‌వుతుంది.

అదే స‌మ‌యంలో జుట్టు ఒత్తుగా, బ‌లంగా పెరుగుతుంది. """/" / అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లెక్స్‌సీడ్ జెల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదం, వ‌న్ టేబుల్ స్పూన్ ఇన్‌స్టెంట్ కాఫీ పౌడ‌ర్ వేసి అన్ని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

చివ‌రిగా ఇందులో మూడు టేబుల్ స్పూన్ల మీ రెగ్యుల‌ర్ షాంపూను యాడ్ చేయాలి.

ఆపై ఈ మిశ్ర‌మంతో త‌ల‌స్నానం చేయాలి.ఈ విధంగా షాంపూ చేసుకున్నా హెయిర్ ఫాల్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

జీవితంలో రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఏవో తెలుసా..?