వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుందా?: అశోక్ గజపతి రాజు

వైసీపీ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్రానికి ఉందని పేర్కొన్నారు.

మంత్రులు రాళ్లు విసరవచ్చు, చొక్కాలు విప్పవచ్చు, బూతులు మాట్లాడవచ్చు కానీ వారిపై ఎలాంటి కేసులు ఉండవని అశోక్ గజపతిరాజు విమర్శించారు.

ఇలాంటివి మంచివి కాదని శాంతియుతంగా చెప్పే వారిపై మాత్రం కేసులా అని ప్రశ్నించారు.

బ్రిటీష్ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని చెప్పారు.ఈ ప్రభుత్వానికి అసలు సిగ్గుందా అన్న అశోక్ గజపతి రాజు చంద్రబాబును 20 రోజులగా జైల్లో పెట్టి ఇంకా నేరం ఏమిటో వెతుకుతుండటం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

కేరళలో అద్భుత ఘటన.. వర్షపు నీటి గుంతను తవ్వుతుండగా దొరికిన నిధి..?