ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎంకు అవమానం..!
TeluguStop.com
విజయవాడ ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎంకు అవమానం జరిగింది.దేవీ నవరాత్రులను పురస్కరించుకొని ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు దుర్గమ్మ దర్శనానికి వచ్చారు.
ఆయనను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.గేట్లకు తాళాలు వేశాం, క్యూలైన్ లో నుంచి వెళ్లాలని సూచించారని సమాచారం.
అనంతరం విషయం తెలుసుకున్న ఆలయ ఈవో భ్రమరాంబ అక్కడకు చేరుకుని డిప్యూటీ సీఎంను దర్శనానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే, ఉదయం కూడా ఆలయ ప్రధాన అర్చకులు డ్యూటీ పాస్ చూపించినా కొందరు పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
దీంతో సెక్యూరిటీ సిబ్బందిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
డెలివరీ తర్వాత జుట్టు పల్చగా మారిపోయిందా.. అయితే ఈ హెయిర్ రీగ్రోత్ టానిక్ మీకోసమే!