రాజ్యాంగ దినోత్సవం రోజు అంబేద్కర్ కి అవమానం
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా:దేశం మొత్తం నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు( Constitution Day ) జరుపుకుంటున్న తరుణంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం( Choutuppal Mandal ) దేవలమ్మ నాగారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.
ఆర్.అంబేద్కర్( Ambedkar ) కు ఘోర అవమానం జరిగింది.
ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలతో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.
అది సాధ్యం కాకపోవడంతో ఖాళీ సీసాలను పగులకొట్టి విగ్రహం వద్ద పడేసారు.సోమవారం ఇది గమనించిన గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి వెంటనే చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?