తొమ్మిదేళ్ల క్రితం విద్యాబాలన్ టైటిల్ రోల్ లో సౌత్ ఇండియన్ హాట్ ఐటెం గర్ల్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ది డర్టీ పిక్చర్x సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం అందుకోవడంతో పాటు ఒక్కసారిగా విద్యా బాలన్ ని స్టార్ ని చేసి కూర్చోబెట్టింది.
అద్భుతమైన కథ, కథాంశంతో తెరపై శృంగార దేవతగా కీర్తింపబడ్డ సిల్క్ నిజజీవితానికి తెర రూపం ఇచ్చి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నారు.
ఈ సినిమాకి నేషనల్ అవార్డు సైతం వచ్చింది.హోమ్లీ పాత్రలకి కేరాఫ్ గా ఉన్న విద్యా బాలన్ ఇందులో శృంగార దేవత సిల్క్ గా జీవించింది అని చెప్పాలి.
ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో బయోపిక్ కల్చర్ జోరందుకుంది.ఎంతో మంది బయోపిక్ కథలు తెరపైకి వచ్చిన ది డర్టీ పిక్చర్ బ్రాండ్ ని మాత్రం చెరపలేకపోయాయి.
ఇప్పుడు మరో సారి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై డర్టీ పిక్చర్ రేంజ్ సినిమా షకీలా రూపంలో రాబోతుంది.
సౌత్ లో అడల్ట్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా శృంగార తారగా, మలయాళీ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న తెలుగు నటి షకీలా జీవిత కథతో ఇంద్రజిత్ లంకేశ్ ఆమె పేరునే టైటిల్ గా మార్చి సినిమా తెరకెక్కించారు.
రిచా చద్దా ఇందులో షకీలా పాత్రలో నటించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ రిలీజ్ అయ్యింది.
ఈ టీజర్ చూస్తూ ఉంటే మలయాళీ ఇండస్ట్రీలో షకీలాకి ప్రేక్షకులుఎంతలా బ్రహ్మరథం పెట్టారో అనే విషయాన్ని ప్రెజెంట్ చేయడంతో పాటు తెరపై ఆమె ఒలికించిన శృంగార రసాన్ని ఆవిష్కరించారు.
రిచా చద్దా షకీలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది.క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు.
మరి ఈ సినిమా డర్టీ పిక్చర్ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
నాని హిట్3 సినిమాలో మరో స్టార్ హీరో కనిపించనున్నారా.. అసలేం జరిగిందంటే?