Vadivelu: వడివేలు గురించి సంచలన వాఖ్యలు చేసిన నటీమణులు.. అవకాశాలు లేకుండా చేశారంటూ?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ వడివేలు( Vaelu ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఒకప్పుడు తెలుగు,తమిళ,కన్నడ సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఎన్నో సినిమాలలో కమెడియన్ గా చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు వడివేలు.
తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమైన వడివేలు ఇటీవల కాలంలో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా విడుదలైన ఒక సినిమాలో వడివేలు అద్భుతమైన నటనలను కనబరిచారు.
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన వడివేలు మామన్నన్( Maamannan Movie ) చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు.
ఈ సినిమాలో అతని నటన చాలా అద్భుతంగా ఉంటుందనడంలో ఎంలాంటి సందేహం ఉండదు.
ఇది ఇలా ఉంటే తాజాగా పలువురు నటీనటులు ఆయన పై పలు ఆరోపణలు చేస్తుంటే నటి షకీలా( Shakeela ) కూడా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
నటి షకీలా గురించి మనందరికీ తెలిసిందే.కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు అన్ని భాషల్లో కలిపి దాదాపు 100కు పైన సినిమాలలో నటించింది.
ప్రస్తుతం ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం నటీనటులను ఇంటర్వ్యూ చేస్తోంది.అందులో భాగంగానే తమిళ నటి అయిన ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేసింది.
నా సినిమా కెరీయర్ ప్రారంభంలో వడివేలు, వివేక్, సంతానం వంటి హాస్య నటులతో చిన్న చిన్న పాత్రల్లో నటించాను.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/08/shakeela-and-prema-priya-comments-vaelu-detailsa!--jpg" /
నాకు అప్పట్లో మంచి అవకాశాలే వచ్చేవి.ఇండస్ట్రీలో నా ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్ట వేశారు.
సినిమాల్లో నటించే అవకాశాలు చాలా వచ్చాయి.కానీ ఆయన వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి.
ఒక్కోసారి ఏదోరకంగా అవకాశం వచ్చింది కదా అని నేను షూటింగ్‌కు వెళ్తాను.కానీ వడివేలు నన్ను చూడగానే ఈ అమ్మాయి వద్దని అక్కడి మూవీ మేకర్స్‌తో చెప్పించి వెనక్కి పంపేవారు.
ఇలా చాలా సినిమాల్లో ఇదే జరిగింది అని చెప్పుకొచ్చింది ప్రేమ ప్రియ.( Prema Priya ) ఒక దర్శకుడు నన్ను ఫోన్‌లో బెదిరించాడు.
నేను యూట్యూబ్ ఛానెల్‌లో వడివేలు గురించి చెప్పిన మాటల్లో నిజం లేదని తిరిగి తెలపాలని ఒకరు వార్నింగ్ ఇచ్చారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/08/shakeela-and-prema-priya-comments-vaelu-detailss!--jpg" /
అందుకు నేను బయపడలేదు.వడివేలు గురించి ఏదైతే నిజమో అదే చెప్పాను.
2010లో వచ్చిన విజయ్ సురా సినిమాలో( Vijay Sura Movie ) వడివేలుతో కలిసి నటించినప్పుడు కూడా ఆయన నో చెప్పారు.
అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు.కారణం ఏంటో చెప్పరు అని ప్రేమ ప్రియ తెలిపింది.
అప్పుడు వెంటనే షకీలా వడివేలుపై మీ-టూ ఫిర్యాదు( Me Too ) చేసి ఉండవచ్చు కదా అని ప్రశ్నించింగా.
ప్రియ మాట్లాడుతూ.వడివేల్ కి తనకు మీ టూ సమస్య లేదని, అది వేరే సమస్య అని ప్రేమ ప్రియ చెప్పింది.
అయితే వడివేలు తనకు బాగా తెలుసని షకీలా పేర్కొంది.షూటింగ్ స్పాట్‌లో ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తనకు బాగా తెలుసని నటి షకీలా ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.
దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పూరీ జగన్నాధ్ ఇప్పటికైన తన కొడుకుతో ఒక సినిమా చేయచ్చు కదా..