పవన్ కళ్యాణ్ కు ఓటమి అలవాటే.. పిఠాపురం విషయంలో మాత్రం పవన్ లక్ష్యం ఇదే!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి షకలక శంకర్( Shakalaka Shankar ) ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

షకలక శంకర్ పవన్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.జబర్దస్త్ షోలో గతంలో షకలక శంకర్ పవన్ కు అనుకూలంగా స్కిట్లు చేసిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో అపజయాలే ఎక్కువని సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా పవన్ కు ఫెయిల్యూర్స్ వచ్చాయని షకలక శంకర్ అన్నారు.

పవన్ కళ్యాణ్ కు ఓడిపోయినా, గెలిచినా పెద్దగా తేడా ఉండదని అయితే పిఠాపురం( Pithapuram ) ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలవాలని ఆయన తెలిపారు.

అపజయాలు విజయానికి సంకేతం పవన్ కు విజయం దక్కుతుందని పవన్ ను చూసి అపజయం కూడా భయపడుతుందని షకలక శంకర్ తెలిపారు.

ఎన్నో ఫ్లాప్స్ తర్వాత గబ్బర్ సింగ్ హిట్టైందని అదే విధంగా పొలిటికల్ గా కూడా పవన్ కు సక్సెస్ దక్కుతుందని ఆయన కామెంట్లు చేశారు.

"""/" / ఇండియాలో 100 మంది హీరోలు ఉన్నా సినిమాల కోసం ఎంతో శ్రమించి కష్టపడింది చిరంజీవి( Chiranjeevi ) అని ప్రతి సినిమాలో ఆయన కష్టం కనిపిస్తుందని షకలక శంకర్ వెల్లడించారు.

కోన వెంకట్( Kona Venkat ) వల్లే నేను ఇప్పటికీ యాక్టర్ గా కొనసాగుతున్నానని ఆయన అన్నారు.

జబర్దస్త్ షోకు( Jabardasth ) నేను గుడ్ బై చెప్పి వచ్చానని షకలక శంకర్ పేర్కొన్నారు.

"""/" / పిఠాపురం విషయంలో కచ్చితంగా పవన్ కు అనుకూల ఫలితాలు దక్కాలని కోరుకుంటున్నానని షకలక శంకర్ వెల్లడించారు.

ఈ నియోజకవర్గం విషయంలో ఏ జరుగుతుందో చూడాల్సి ఉంది.పిఠాపురంలో వంగా గీత నుంచి పవన్ కు గట్టి పోటీ ఎదురవుతోంది.

ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతోంది.

న్యూజిలాండ్ బీచ్‌లో వింత తిమింగలం.. చూసి షాక్ అవుతున్న స్థానికులు..