భార్య, పిల్లల గురించి ఆలోచించకుండా పవన్ కోసం అన్ని లక్షల ఖర్చు చేశా.. చివరకు?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వీరాభిమానులలో షకలక శంకర్ ఒకరు కాగా షకలక శంకర్ పవన్ కళ్యాణ్ పై అభిమానంతో 7 లక్షల రూపాయలు ఖర్చు చేశానంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

2019 ఎన్నికల సమయంలో రెండు సినిమాల అడ్వాన్స్ లు వచ్చాయని ఆ సమయంలో తుఫాన్ బాధితులకు భోజనాలను ఏర్పాటు చేశాయని ఆ సమయంలో జనసేన ( Janasena )ప్రచారం కోసం కూడా ఖర్చు చేశానని షకలక శంకర్ తెలిపారు.

ఆ సమయంలో 7 లక్షలు ఖర్చయ్యాయని ఆయన అన్నారు. """/" / భార్య, పిల్లలు నేను డబ్బులు తెస్తానని ఎదురుచూస్తున్నారని కానీ ఆ డబ్బులను నేను ఖర్చు చేశానని షకలక శంకర్ తెలిపారు.

నేను చేసింది తప్పు కాదని అయితే వాళ్లకు నేను చెప్పేది అర్థం కాదని నాలుగురోజులు నా భార్య నాతో మాట్లాడలేదని షకలక శంకర్ అన్నారు.

మా మమయ్య పవన్ కోసం అంత ఖర్చు చేస్తే పవన్ ఏమైనా ఫోన్ లేదా మెసేజ్ చేశారా అని అడిగారని షకలక శంకర్ తెలిపారు.

"""/" / నేను చిరంజీవి, పవన్ ( Chiranjeevi, Pawan Kalyan )తో సినిమాలు చేసినా వాళ్లతో ఫోటోలు అడగలేదని షకలక శంకర్ అన్నారు.

ఆ సమయంలో నేను చేసింది పవన్ కు తెలుసా అని అనిపించిందని ఆయన తెలిపారు.

అభిమానంతో చేయాలనిపించింది చేశానని షకలక శంకర్ అన్నారు.2024 ఎన్నికల్లో ప్రచారం చేశానే తప్ప నా డబ్బులు అయితే ఖర్చు చేయలేదని షకలక శంకర్ వెల్లడించడం గమనార్హం.

పవన్ పై అభిమానంతో మాత్రమే నేను మాట్లాడానని ఆయన పేర్కొన్నారు.ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం రాజకీయం కాదని షకలక శంకర్ వెల్లడించారు.

పవన్ కు ఓటేయాలని ఆయన గురించి నేను చెప్పానని షకలక శంకర్ పేర్కొన్నారు.

షకలక శంకర్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దానంకు మంత్రి పదవి ? కానీ ఆ టార్గెట్ పూర్తి చేస్తేనే