పుష్ప సినిమాని మూడుసార్లు చూశాను… బన్నీ ట్వీట్ కి షారుక్ రిప్లై?
TeluguStop.com
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) తాజాగా జవాన్ సినిమా ( Jawan Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంత మంచి సక్సెస్ అందుకున్న మనకు తెలిసిందే .పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉన్నారో ఇక ఈ సినిమా చూసినటువంటి సినీ సెలబ్రిటీలు సైతం వరుసగా ఈ సినిమాపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి వారు జవాన్ సినిమాకు తమ రివ్యూ ఇచ్చారు ఇక తాజాగా అల్లు అర్జున్( Allu Arjun ) చేసిన ట్వీట్ కి షారుక్ స్పందించారు.
"""/" /
జవాన్ సినిమా గురించి అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ షారుఖ్ మాస్ అవతార్ అని, మూవీలో షారుఖ్ స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు పొగిడేస్తూ రాసుకొచ్చాడు.
అలాగే చిత్ర బృందంపై కూడా పై ప్రశంసలు కురిపించారు.ఇలా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ ట్వీట్ కు షారుఖ్ ఖాన్ రిప్లై ఇస్తూ.
స్వాగ్ విషయంలో పుష్ప ది ఫైరే నన్ను పొగుడుతుంది.ఈరోజు ఎప్పటికి మర్చిపోలేను.
పుష్పని మూడుసార్లు చూసి ఉంటాను నేను.నిన్న పర్సనల్ గా కలుసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చారు.
"""/" /
ఈ విధంగా అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ మధ్య ఈ ట్వీట్ల సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక జవాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ అట్లికి తెలుగు హీరోలతో సినిమా చేసే అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది.
అయితే ఈ వరుసలో అల్లు అర్జున్ కూడా ఉన్నట్టు సమాచారం.ప్రస్తుతమైతే అల్లు అర్జున్ సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత ఈయన మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక పుష్ప సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.
ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!