హిందీ బెల్ట్ లో జవాన్ కొత్త చరిత్ర.. అన్ని రాబట్టిన ఏకైక మూవీ ఇదే!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) సౌత్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ''జవాన్''.

( Jawan ) ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యింది.

ఇక రిలీజ్ రోజు నుండి కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది.

షారుఖ్ ఖాన్ ఈ సినిమా కంటే ముందు పఠాన్ తో 1000 కోట్ల ప్రాజెక్ట్ ను బాలీవుడ్ కు అందించి అప్పటి వరకు తనపై వచ్చిన ట్రోల్స్ కు చెక్ పెట్టారు.

ఇక పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత షారుఖ్ సౌత్ డైరెక్టర్ ను ఎంచుకోవడంతో అంత షాక్ అయ్యారు.

ముఖ్యంగా అట్లీ( Atlee ) గురించి నార్త్ బెల్ట్ లో అంతగా గుర్తింపు లేకపోవడంతో ఈయన మళ్ళీ హిట్ ఇస్తాడా లేదా అనే ఆలోచలో షారుఖ్ ఫ్యాన్స్ సైతం ఉన్నారు.

కానీ ఈ సినిమా పఠాన్ ను మించిన హిట్ అయ్యి షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో హిట్ పడేలా చేసాడు.

"""/" / షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార( Nayanthara ) హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ''జవాన్''.

ఈ సినిమా మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.జవాన్ సినిమాను లాజిక్ తో పని లేకుండా అట్లీ తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ క్రియేట్ చేసాడు.

మొదటి రోజు నుండి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న జవాన్ మూడు రోజుల్లోనే 500 మార్క్ చేరుకొని అందరికి షాక్ ఇచ్చింది.

"""/" / ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి 11 రోజులు అవుతున్న ఇంకా థియేటర్స్ లో క్రేజ్ మాములుగా లేదు.

మరి తాజాగా జవాన్ సినిమాతో షారుఖ్ మరో సంచలన రికార్డ్ క్రియేట్ చేసాడు.

హిందీ బెల్ట్ లోనే( Hindi Belt ) 11 రోజుల్లో 400 కోట్ల వసూళ్లను తక్కువ సమయంలోనే రాబట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.

ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరు క్రియేట్ చేయలేదు.ఇక ఇప్పటి వరకు జవాన్ వరల్డ్ వైడ్ గా 797 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.

నేను మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి.. సాయిపల్లవి కామెంట్స్ వైరల్!