షారుక్ ఖాన్ తన కొడుకు బెయిల్ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలుసా..! 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ ను డ్రగ్స్ కేసులో Ncb అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అయితే, తన కొడుకును విడిపించుకోవడానికి కింగ్ ఖాన్ షారుక్ భారీగానే ఖర్చు చేశారని తెలుస్తోంది.

ఆర్యన్ ఖాన్‌‌ను బయటకు తీసుకొచ్చేందుకు ఇండియాలో టాప్ 3 క్రిమినల్ లాయర్స్‌ను నియమించుకున్నారు.

తన కొడుకు అరెస్టు అయిన నాటి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు షారుక్ చాలా సీరియస్‌గానే ట్రై చేశారు.

కానీ, NCB తరఫు న్యాయవాది వాదనలో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ను పలుమార్లు కొట్టి వేసింది.

అనుకోకుండా షారుక్ కొడుకు ముంబైలో జరిగిన ఓ క్రూయిజ్ షిప్ పార్టీకి వెళ్లి అక్కడ NCB అధికారులకు పట్టబడ్డాడు.

కానీ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అంటే లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.కానీ డ్రగ్స్ వినియోగిస్తున్న వారితో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు ఆరోపించారు.

ఇకపోతే షారుక్ తన కొడుకు బయటకు తీసుకొచ్చేందుకు దేశంలోనే టాప్ 3 లాయర్స్‌ను నియమించారు.

వారిలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సతీష్ మనిష్ షిండే, అమిత్ దేశాయ్ ఉన్నారు.

ఇక ఎన్సీబీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదించారు. """/"/ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ కోసం వాదించిన క్రిమినల్ లాయల్స్‌లో సతీష్ మనిష్ షిండే రోజుకు రూ.

20 నుంచి 25లక్షలు, అమిత్ దేశాయ్ రోజుకు 25 నుంచి 26లక్షలు, ఇక అందరి కంటే సీనియర్ ముకుల్ రోహత్గీ రోజుకు రూ.

30 లక్షలు చార్జ్ చేస్తారని తెలిసింది.అనగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి సుమారు 25 రోజులకు పైగా ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు.

తాజాగా బాంబే హైకోర్టు అక్టోబర్ 28వ తేదీన షారుక్ తనయుడికి బెయిల్ మంజూరు చేసింది.

"""/"/ అనగా ముగ్గురు క్రిమినల్ లాయర్లు 25 రోజులకు పైగా కేసును వాదించారు.

అందుకోసం వారు ఒక్కో రోజు ఎంత ఫీజు తీసుకుంటారో అలా 25 రోజులు షారుక్ వద్ద నుంచి చార్జ్ చేశారన్నమాట.

ఈ ప్రకారం చూసుకుంటే కింగ్ ఖాన్ తన కొడుకు కోసం రూ.కోట్లల్లో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

శివ సినిమా వచ్చి అప్పుడే 35 సంవత్సరాల అవుతుందా..?