వెబ్ సిరీస్ కోసం వంద కోట్లు కావాలంటున్న స్టార్ హీరో!

ఎవరైనా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఒక సినిమా చేస్తున్నారు అంటే.ఆ సినిమా కోసం ఎంత కాలం కేటాయించాలి? ఎంత పని చెయ్యాలి అనేది తెలుస్తుంది.

ఆ పని, సమయాన్ని బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటారు.ఇక అలానే బాలీవుడ్ స్టార్ హీరో కూడా తన రెమ్యూనరేషన్ ని ఎంత తీసుకుంటున్నాడో చెప్పాడు.

ఆ రెమ్యూనరేషన్ విన్న ప్రేక్షకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ కి అంతనా అని షాక్ అయిపోతారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.హీరో షాహిద్ కపూర్.

ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ హీరో ఎవరు అంటే కళ్లు మూసుకొని చెప్పేస్తారు.

షాహిద్ కపూర్ అని.తెలుగు సూపర్ హిట్ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ కబీర్ సింగ్ లో నటించి అతని స్టార్ డమ్ అమాంతం పెంచుకున్న సంగతి తెలిసిందే.

ఇక అలాంటి షాహిద్ కపూర్ ఒక వెబ్ సిరీస్ కి ఏకంగా వంద కోట్లు అడిగాడట.

మతిపోతుంది కదా! నిజానికి భారత్ లో వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు.

ఇక అలాంటిది యంగ్ హీరో షాహిద్ కపూర్ ఒక్క వెబ్ సిరీస్ కి వంద కోట్లు అడగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఏంటండీ మీరు చెప్పేది అంటూ అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే వెబ్ సిరీస్ కొన్ని ఏళ్ళ పాటు నడుస్తుంది కాబట్టి ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు.

ఇక ఈ వెబ్ సిరీస్ ప్రపంచ స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ గా రానుందని.

అది కూడా ఓటీటీలో నెంబర్ వన్ ఫ్లాట్ ఫామ్ గా దూసుకుపోతున్న నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ రానుంది.

సినిమా పరంగా వందకోట్లు ఎక్కువ అవ్వచ్చు కానీ వెబ్ సిరీస్ ప్రకారం చాలా తక్కువ అని కొందరు అంటారు!.

ఇంట్లోకి త‌ర‌చూ పాములు వ‌స్తున్నాయా.. ఇలా చేశారంటే వాటితో ఇక‌పై నో టెన్ష‌న్‌!