ఆ సినిమా తర్వాత బిచ్చగాడిగా మారిపోయా.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇలా బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న షాహిద్ కపూర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమా రీమేక్ చిత్రంలో నటించారు.

ఈ క్రమంలోనే జెర్సీ హిందీ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదల చేశారు.ఈ క్రమంలోనే షాహిద్ కపూర్ బాలీవుడ్ లైఫ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా షాహిద్ కపూర్ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుందని ఇప్పటివరకు తను అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడం లేదని తెలిపారు.

ఈ క్రమంలోనే కొందరు 200_250 కోట్ల బడ్జెట్ తో చిత్రాలను తెరకెక్కించే నిర్మాతలు దగ్గరకు వెళుతూ తనతో ఓ సినిమా తీయాలని అడుగుతూ ఒక బిచ్చగాడిగా మారిపోయారని ఈ సందర్భంగా షాహిద్ కపూర్ వెల్లడించారు.

ఇప్పటివరకు తన కోరిక తీరలేదని మొట్టమొదటిసారిగా ఈ సినిమా ద్వారా తన కోరిక తీరిందని ఈ హీరో వెల్లడించారు.

"""/"/ షాహిద్‌ నటించిన తెలుగు రీమేక్‌ ‘జెర్సీ’ డిసెంబర్‌ 31న విడుదల కానుంది.ఈ చిత్రాన్ని హిందీలో కూడా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు.

ఇందులో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది.పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రలలో నటించారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ విశేష ఆదరణ తగ్గించుకుని సినిమాపై అంచనాలను పెంచుతుంది.

Surekha Vani : నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను.. కార్ కూడా లోన్ లో ఉంది