జెర్సీ రీమేక్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో
TeluguStop.com
అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ సినిమా హిందీలో తెరకెక్కింది.ఈ సినిమాతో షాహిద్ కపూర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో తన స్టామినాని చూపించి భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాడు.
ఏకంగా 380 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది.దీంతో షాహిద్ కపూర్ కి బాలీవుడ్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
ఈ నేపధ్యంలోనే అతని రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేశాడు.ఆ ఎఫెక్ట్ ఏకంగా జెర్సీ రీమేక్ మీద కూడా కనిపించింది.
తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమా తెరకెక్కింది.ఇక్క ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
దీంతో దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకొని షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నారు.
హిందీలో కూడా ఈ సినిమాకి గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నారు.అక్కడ సుమారు 50 కోట్ల బడ్జెట్ తో జెర్సీ రీమేక్ ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.షాహిద్ కపూర్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు.
కరోనా లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్ ముందుకి సాగలేదు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ఏకంగా 35 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది.
పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో కూడా షేర్ పొందబోతున్నాడు.జెర్సీ సినిమా యావరేజ్ హిట్ అయినా కూడా మరో 15 కోట్ల వరకు షాహిద్ కపూర్ లాభాల్లో వాటా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
జెర్సీ సినిమాతో హిట్ టాక్ తెచ్చుకుంటే షాహిద్ కపూర్ కి ఈ సినిమా ద్వారా ఏకంగా 50 కోట్ల వరకు దక్కుతుందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండటంతో కచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకొని రెండు వందల కోట్లు చాలా ఈజీగా కలెక్ట్ చేసేస్తుందని బిటౌన్ లో వినిపిస్తుంది.
మాట వినాలంటున్న ‘హరి హర వీరమల్లు’.. పవన్ పాట విన్నారా?