తెలుగు స్టేట్స్ లో ‘జవాన్’.. ఆ రికార్డ్ సాధించిన ఏకైక హీరో ఇతడే!
TeluguStop.com
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) మరొక అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చాడు.
గత సినిమా 'పఠాన్'( Pathaan ) తో బాలీవుడ్ కు అందని ద్రాక్షగా మిగిలిపోయిన 1000 కోట్ల సినిమాను షారుఖ్ ఇచ్చి తమ బాలీవుడ్ పరువును కాపాడాడు.
ఈ సినిమాతో వరుస ప్లాపులతో ఉన్న హిందీ పరిశ్రమకు కొత్త ఉత్సాహం లభించింది.
ఇక ఈ సినిమా పూర్తి కాగానే మరో సినిమాను లైన్లో పెట్టాడు. """/" /
ఆ సినిమా మొన్న సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
57 ఏళ్ల వయసులో కూడా ఫిట్ గా కుర్ర హీరోలకు పోటీగా షారుఖ్ సినిమాలు చేస్తున్నాడు.
మరి తాజాగా ''జవాన్'' సినిమా( Jawan Movie )తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుఖ్ కు మరొక బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.
షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ తెరకెక్కగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
"""/" /
ఈ సినిమాలో దీపికా పదుకొనె( Deepika Padukone ), ప్రియమణి కీ రోల్స్ పోషించారు.
ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మించగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.
కాగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించి మెప్పించాడు.ఇంత మంది కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ తో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో రిలీజ్ అయిన అన్ని చోట్ల దూసుకు పోతుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకు పోతుంది అనే చెప్పాలి.
ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 9 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది అనే చెప్పాలి.
మన తెలుగులో ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సినిమాకు ఇలాంటి రికార్డ్ లేదు.
దీంతో షారుఖ్ ఖాన్ మాత్రమే ఈ అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
వైరల్ వీడియో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్ తో సందడి చేసిన కలెక్టర్