అచ్చం షారుఖ్ ఖాన్ లా ఉండే వ్యక్తిని చూసి అభిమానులు అంతా అలా వచ్చారు.. కానీ?

సాధారణంగా మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటూ ఉంటారు.ఇది ముమ్మాటికి నిజమే.

ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ ల పోలికలతో ఇప్పటికే పలువురు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

మరీ ముఖ్యంగా కరోనా సమయంలో అచ్చం సెలబ్రిటీలను పోలిన సాధారణ వ్యక్తులకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

హీరో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా కేవలం టాలీవుడ్ హీరోల మాదిరి మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోల మాదిరిగా కూడా కొందరు ఉన్నారు.

అలాంటి వారిలో ఇబ్రహీం ఖాద్రి కూడా ఒకరు.ఇతను అచ్చం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లాగే కనిపిస్తూ ఉంటాడు.

అయితే ఇతన్ని చూసిన షారుక్ ఖాన్ అభిమానులు షాక్ కు గురి అవుతూ ఉంటారు.

గుజరాత్ కు చెందిన ఇబ్రహీం అచ్చం అలాగేఉంటాడు.అచ్చం షారుక్ ఖాన్ లా కనిపించే ఇబ్రహీం కు ఇంస్టాగ్రామ్ లో 122k ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక ఇబ్రహీం షారుఖాన్ సినిమా లోని ఆయన సీన్ లను రీ క్రియేట్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.

ఇబ్రహీం తల్లిదండ్రులు అయితే షారుక్ ఖాన్ పోలికలతో వారి కొడుకు జన్మించినందుకు ఎంతో గర్వ పడేవారట.

"""/" / ఇబ్రహీం బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చే కొద్దీ షారుఖ్ ఖాన్ ల కనిపించడం మొదలు పెట్టాడట.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇబ్రహీం గతంలో తనకు జరిగిన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ.హీరో షారుక్ ఖాన్ నటించిన రైస్ సినిమా సమయంలో థియేటర్ కి సినిమా చూడడానికి వెళ్లగా అక్కడ అభిమానులు ఇబ్రహీం ను నిజమైన షారుక్ ఖాన్ అనుకొని సెల్ఫీల కోసం ఎగబడ్డారట.

అంతేకాకుండా అతన్ని ముందుకు కదలనీయకుండా చుట్టుముట్టేశారట.కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ లయన్స్ ఐపీఎల్ మ్యాచ్ చూడటం కోసం అని స్టేడియంకు వెళితే అక్కడ అందరూ షారుక్ ఖాన్ అనుకొని అతనితో సెల్ఫీల కోసం ఎగబడ్డారట.

ఇలా ఇబ్రహీం ఎక్కడికి వెళ్లినా కూడా ఫ్యాన్స్ సెగ తప్పడం లేదు, మరి బాలీవుడ్ బాద్ షా ప్రతిరోజు ఇలాంటి ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడో నాకు అప్పుడు తెలిసి వచ్చింది అని తెలిపాడు ఇబ్రహీం.

తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్ మోసం.. రూ.50 వేలు డిమాండ్