స్టార్ డైరెక్టర్ తో తమిళ్, హిందీ సూపర్ స్టార్స్.. విశేషమేంటంటే?
TeluguStop.com
ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య.ఒక టాలెంటెడ్ మేకర్.
ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఇంతకీ ఈ స్టార్స్ ఎవరు.
ఆ డైరెక్టర్ ఎవరు? అనేది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ బర్త్ డే నిన్న గ్రాండ్ గా జరిగింది.
ఈయన ప్రెజెంట్ వరుస సూపర్ హిట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ డైరెక్టర్ కోలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నాడు.
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తో వరుసగా సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి.
ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
"""/" / ఈ సినిమా జూన్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఇది ఇలా ఉండగా తాజాగా అట్లీ కుమార్ నిన్న చెన్నై లో తన పుట్టిన రోజు వేడుకను జరుపు కున్నారు.
ఈ పార్టీలో అట్లీ తో పాటు ఒక వైపు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి మరో వైపు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉన్న ఫోటోను అట్లీ షేర్ చేయగా అది ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.
ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య ఈయన ఫోటో దిగగా ఈ ఫొటోతో అందరిని ఆకట్టు కున్నారు.
అలాగే వీరు ముగ్గురు కూడా బ్లాక్ దుస్తుల్లో డాషింగ్ లుక్ లో స్టైలిష్ గా కనిపించారు.
చెప్పులు, చీపుళ్లతో కొడతాం అంటున్నారు.. యాంకర్ శ్యామలపై పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!