నా కొడుకు అమ్మాయిలు, డ్రగ్స్ అంటూ అప్పుడే చెప్పాడు.. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు?

డ్రగ్ మాఫియా బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బయటకు వచ్చిన డ్రగ్ మాఫియా ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీల మెడకు చుట్టుకుంది.

ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలను అధికారులు విచారించగా తాజాగా ప్రముఖ నటుడు కుమారుడు అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని NCB అధికారులకు సమాచారం రావడంతో అధికారులు ఉన్నఫలంగా దాడులు చేసి సోదాలు చేశారు.

ఈ విధంగా క్రూయిజ్ షిప్ లో దాడులు నిర్వహించిన అధికారులు అందులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఉండడంతో పోలీసులు తనతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

అయితేకొన్ని రోజుల క్రితం షారుఖ్ ఖాన్ ఓ పార్టీ లో భాగంగా సరదాగా తన కొడుకు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

షారుక్ ఖాన్ తను యవ్వనంలో చేయని పనులన్నింటిని తన కొడుకు చేయవచ్చని తెలిపారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తన కొడుకు అమ్మాయిలతో తిరగవచ్చు, డ్రింక్, సిగరెట్ తాగొచ్చు, డ్రగ్స్ కూడా ఆస్వాదించవచ్చు అని గతంలో షారుక్ సరదాగా ఈ మాటలు తన కొడుకు గురించి మాట్లాడారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి పనులు చేయలేదని కనుక తన కొడుకు ఈ పనులన్నింటినీ చేయవచ్చని చెప్పిన మాటలను ఆర్యన్ నిజం చేసి చూపించాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ ఈ విధంగా క్రూయిజర్ షిప్పు పై దాడి చేసిన అధికారులు ఆర్యన్ తో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

ఈ క్రమంలోనే కోర్టులో హాజరుపరిచగా ఒకరోజు కస్టడీ విధించింది.అదేవిధంగా డ్రగ్స్ విషయం గురించి ఆర్యన్ ను NCB అధికారులు 12 గంటలపాటు విచారించినట్లు సమాచారం.

ఇకపోతే సోమవారం షారుక్ లాయర్ సతీష్ మన్షిండే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.

పాసింజర్ ఇచ్చిన గిఫ్ట్‌కి ఆటోడ్రైవర్ ఫిదా.. వీడియో వైరల్..