అఫిషియల్ : ”డంకీ” ట్రైలర్ రిలీజ్.. అదిరిన షారుఖ్ డిఫరెంట్ షేడ్స్!

బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) గురించి తెలియని సినీ లవర్ ఉండరు.

ఈయన ఇండియా వైడ్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరోల్లో ఒకరు.

మరి అలాంటి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ మధ్య వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ బాలీవుడ్ పరువు నిలుపుతున్నాడు.

"""/" / షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి.

ఎందుకంటే ఒకే ఏడాది రెండు సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

చాలా గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో వచ్చిన షారుఖ్ కు అదిరిపోయే హిట్ దక్కింది.

ఇక ఈ మధ్యనే 'జవాన్' సినిమాతో వచ్చి మరో హిట్ అందుకున్నాడు. """/" / వరుసగా రెండు వెయ్యి కోట్ల ప్రాజెక్టులను అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఇదే జోష్ లో ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు షారుఖ్.

మరి షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన మూవీ ''డంకీ''.ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

బాలీవుడ్ బడా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ( Rajkumar Hirani_తెరకెక్కిస్తున్న ''డంకీ'' సినిమా నుండి కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

ముందు నుండి ప్రచార కార్యక్రమాలతో మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ప్రామిసింగ్ గా ఉంది.

షారుఖ్ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.మంచి ఫన్ టైమింగ్ తో పాటు డీసెంట్ యాక్షన్ తో హిరానీ మార్క్ ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది.

షారుఖ్ ఖాన్ తన గ్యాంగ్ తో లండన్ వెళ్లాలని అనుకోగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అనే విషయాన్నీ మంచి ఎంటర్టైనింగ్ గా చూపించగా ట్రైలర్ తో మరింత ఆకట్టుకుంటుంది.

రాజ్ కుమార్ హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుండగా ప్రభాస్ సలార్ తో పోటీ పడబోతోంది.

చూడాలి ఎవరు విన్ అవుతారో.