జవాన్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ డిటైల్స్ ఇవే.. ఎవరు దక్కించుకున్నారంటే?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గత సినిమా 'పఠాన్' ( Pathaan )తో హిట్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమాతో దశాబ్ద కాలం తర్వాత ఇలాంటి హిట్ అందుకోవడంతో కింగ్ ఖాన్ మరింత హుషారుగా తన నెక్స్ట్ సినిమాను చేసారు.

57 ఏళ్ల వయసులో కూడా ఫిట్ గా కుర్ర హీరోలకు పోటీగా షారుఖ్ సినిమాలు చేస్తున్నాడు.

మరి తాజాగా ''జవాన్''( Jawan ) సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

"""/" / ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూడగా ఈ రోజు ఈ సినిమా పాన్ ఇండియన్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ తెరకెక్కగా ముందు నుండి భారీ అంచనాలు పెరగడంతో ఈ సినిమా రేంజ్ పెరిగి పోయింది.

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరగడంతో ఓపెనింగ్స్ కూడా కుమ్మేయనుంది.

మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ అనే టాక్ సొంతం చేసుకోవడంతో ఇక జవాన్ సినిమాను ఆపేవారే లేరు.

ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్( Jawan Movie Digital And Satellite Rights ) ఫుల్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది.

"""/" / ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ను ఎవరు సొంతం చేసుకున్నారంటే.

జవాన్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ ఛానెల్ నెట్ ఫ్లిక్స్( Netflix ) సొంతం చేసుకోగా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు దక్కించుకుంది.

ఇక ఇందులో దీపికా పదుకొనె కీ రోల్ పోషించింది.అలాగే ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.

మెగా హీరోలకు వరుస ఫ్లాపుల వెనుక కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరుగుతోందా?