Shah Rukh Khan : జవాన్ మూవీ సక్సెస్.. ఒక్కసారిగా భారీగా పారితోషికాన్ని పెంచిన షారుక్ ఖాన్.. అన్ని కోట్లు డిమాండ్?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల సెప్టెంబర్ 7న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది.

ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే వారం రోజుల్లోనే రూ.700 కోట్లకు గ్రాస్ ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా కంటే ముందు షారుఖ్ నటించిన పఠాన్ సినిమా కూడా విడుదల అయ్యి 900 కోట్లకు పైగా వసూళ్ల ను రాబట్టడంతో పాటు జవాన్ సినిమా( Jawan Movie ) కూడా అదే దిశగా దూసుకెళ్తోంది.

"""/" / దీంతో షారుక్ ఖాన్( Shah Rukh Khan ) తన పారితోషికాన్ని అమాంతం పెంచేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పటికే జవాన్ సినిమా కోసం లాభాల్లో వాటాతో పాటు తన పాత్ర కోసం రూ.

100 కోట్లు పారితోషకంగా తీసుకున్నారట.అంతేకాకుండా తన నెక్స్ట్ మూవీ డుంకి కోసం కూడా రూ.

100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి.అయితే లేటెస్ట్ బాలీవుడ్ ( Bollywood )రిపోర్ట్స్ ప్రకారం జవాన్ సక్సెస్ తో షారుక్ తన నెక్స్ట్ మూవీకి రూ.

100 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని తీసుకోబోతున్నాడని టాక్.అది ఎంత అనేది కరెక్ట్ గా తెలియకపోయినా రూ.

100 నుంచి రూ.125 కోట్ల మధ్యలోనే షారుక్ రెమ్యూనరేషన్ ఉండబోతున్నట్లు బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

"""/" / ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో షారుఖ్ ఖాన్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ.

మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను, షారుక్ రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు.

ప్రపంచంలో ఏ ఒక్క యాక్టర్ కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకొని నెక్స్ట్ మూవీ నిర్మాణంలో ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ పెంచమని నిర్మాతల దగ్గరికి వెళ్ళడు.

ఇక షారుక్ విషయాన్ని వస్తే ఆయన నటిస్తున్న డుంకి మూవీ దాదాపు పూర్తయింది.

జవాన్ సమయంలోనే డుంకి మూవీ కి సైన్ చేశారు షారుక్.అలాంటప్పుడు అతను రెమ్యూనరేషన్ ఎక్కువ ఎలా అడుగుతాడు? అని చెప్పుకొచ్చాడు.

మెగా హీరోలకు వరుస ఫ్లాపుల వెనుక కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరుగుతోందా?