వ్యభిచారిణి నుండి బాలీవుడ్ ప్రముఖ రచయితగా... ఎవరో తెలుసా?
TeluguStop.com
జీవితం ఎపుడు ఏ మలుపు తిరుగుతుంది అన్నది ఎవరూ ఊహించలేము.ఈ రోజు ఉన్న పరిస్థితులు శాశ్వతం కావు, కాలంతో పాటు అన్ని మారుతుంటాయి.
ఇక రంగుల లోకం సినీ ప్రపంచంలోని చాలా మంది సెలబ్రెటీల జీవితాలు అయితే అస్సలు ఊహకు అందని విధంగా రకరకాలుగా ఉంటాయి.
ఎక్కడో చిన్న స్థాయి నుండి చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టిన వారి కెరియర్ అనూహ్యమైన మలుపులు తిరిగి ఊహించిన స్థాయిలో ఉన్న వారు కూడా ఉన్నారు.
అలాగే ఆకాశం నుండి పాతాళానికి జారిపడిన నటులు సంఖ్య కూడా ఎక్కువే.ఇలా అందరి జీవితం లోనూ ఒడిదుడుకులు ఉంటాయి.
అయితే ఇపుడు మనం ఒక బాలీవుడ్ సెలబ్రిటీ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ఆమె జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో గుణపాఠాలు, మరెన్నో జ్ఞాపకాలు.బాలీవుడ్ సెలబ్రిటీ అయిన షాగుప్తా రఫీక్ అందరికీ సుపరిచితురాలే.
ఒక బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం ఆమెకు తన తల్లితండ్రులు ఎవరన్నది కూడా తెలియదు.
చిన్న పాపగా ఉన్నప్పుడే రోడ్డుపై తనని ఒంటరిగా వదిలి వెళ్ళడంతో ఒక పెద్దావిడ తనని పెంచి పోషించింది.
అయితే కొన్నాళ్ళకి ఆమె చనిపోవడం ఆమె కుటుంబం ని కూడా పోషించాల్సిన బాధ్యత షాగుప్తా రఫీక్ పై పడింది.
దాంతో ఆమె డ్యాన్సర్ గా మారింది.దాదాపు పదేళ్ల పాటు డ్యాన్సర్ గా పలు చోట్ల నృత్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేది.
ఆ సమయంలో ఆమె వ్యభిచారం చేస్తూ వ్యభిచారిణి గా మారింది.అయితే ఆమెలో ఒక మంచి రచయిత కూడా ఉన్నారన్న విషయం గ్రహించి తన ప్రతిభను నిరూపించుకోవటానికి తనకు తెలిసిన కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు అవకాశం దొరికినప్పుడల్లా తన కథలను వినిపించేది.
కొందరు ఈమెని చిన్న చూపు చూసేవారు.అయినా ఆమె తన ప్రయత్నాన్ని ఏమాత్రం ఆపలేదు, తనపై తనకు ఉన్న నమ్మకం తనని ముందుకు నడిపింది.
అలా ముందుకు కొనసాగుతుండగా అనుకున్న అవకాశం లభించింది.అలా ఆమె రచయితగా మారారు.
మర్డర్, ఓ లాంహే , 2 ,రాజ్ 3 ,జన్నత్ 2 వంటి సినిమాలకు రచయితగా పనిచేసారు.
అయితే ఇపుడు ఆమె కొంచం డిఫరెంట్ గా థింక్ చేసి ఒక కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయ్యారు.
అదేమిటంటే ఆమె తన సొంత కథనే కథనంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు.
ఈ సినిమాకి మహేష్ బట్ నిర్మాణ బాధ్యతలు తీసుకోనున్నారు.ఈ కథలో మధ్యతరగతి మహిళల జీవితాలు ఏ విధంగా ఉంటాయి .
కొందరు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా జీవితం చూపించే దారుల్లో ముందుకు వెళతారు, మరికొందరు ముళ్ళ కంచల్లో ఇరుక్కుపోతారు అన్నది చూపించనున్నారు.
ఇది ఆమె జీవితానికి దగ్గరగా ఉండనుంది. """/"/
ఒక మధ్య తరగతి మహిళ తన జీవన ప్రయాణంలో బార్ డాన్సర్ గా మారడం ఆ క్రమంలో వ్యభిచారంలోకి కూడా రావాల్సిన పరిస్థితులు అనే మైన్ లైన్ తో ఈ కదా ఉండనుంది .
కొందరు కేవలం డబ్బు, విలాసవంతమైన జీవితం కోసం ఇలాంటి పనులు చేస్తే మరికొందరు బ్రతకడానికి వేరే మార్గం లేక, జీవితం ముందుంచిన సవాల్లను అధిగమించే సమయంలో ఇలాంటి వాటికి లోబడాల్సి వస్తుంది అని షాగుప్తా రఫీక్ అన్నారు.
అయితే ఈ కథ అందరికీ నచ్చుతుందని, జీవితం అందరికీ ఒకే విధంగా ఉండదు, కిటికీలో నుండి ఇలాంటి జీవితాన్ని చూడటం వేరే అలాగే నేరుగా అదే స్థానంలో ఉండటం వేరే అన్నారు ఆమె.
ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరన్న అంశంపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.
సూపర్ హిట్ చిత్రం ఛావా సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?