Shabbir Ali: కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది..అందుకే గంప గోవర్ధన్ రమ్మంటున్నాడు ..!!
TeluguStop.com
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావచ్చు.
మరోసారి అసెంబ్లీ సమావేశాలు రాకముందే ఎన్నికలు వస్తాయి.ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి.
అధికార బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అంతా రాష్ట్రంలో సాధించిన ప్రగతి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు.
అంతేకాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలోనే మాజీ మంత్రి షబ్బీర్( Shabbir Ali )ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
"""/" / ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) ఓటమి భయంతో ఉన్నారని అందుకే గంప గోవర్ధన్( Gampa Govardhan )రమ్మంటున్నారని అన్నారు.
అయితే ఆయన కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ వచ్చిన వాళ్ళ తాత వచ్చిన పోరాడుతానని, హుజురాబాద్ ఎన్నికల్లో లాగా ఇక్కడ కూడా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే గంప గోవర్ధన్ ఓటమి భయంతోనే కేసీఆర్ ను రమ్మంటున్నారని తెలియజేశారు.
"""/" / కామారెడ్డి (kamareddy)జిల్లాలో నేను కట్టించిన ఇందిరమ్మ ఇల్లు తప్ప డబల్ బెడ్ రూములు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం వస్తే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి అడగండి అని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటి స్థలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారు.
ఇటీవలే గంప గోవర్ధన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే నేను ఒక సామాన్య కార్యకర్తగా ఆయన ప్రచారానికి వెళ్తానని తెలిపారు.
కెసిఆర్ కామారెడ్డినుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే తనకు ఏదో ఒక పదవి ఇస్తారని స్పష్టం చేశారు.
గోవర్ధన్ ఈ విధంగా కామెంట్లు చేయడంతో రాజకీయ వర్గాల్లో మరింత హిట్ పెరిగింది.
అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!